హైద్రాబాద్, జనవరి 30, (way2newstv.com)
అల్లు అర్జున్‌కి ‘అల.. వైకుంఠపురములో’ చిత్రంతో కెరియర్‌లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చారు నిర్మాత, బన్నీ ఫాదర్ అల్లు అరవింద్. ఎంత ఫాదర్ అయినా సినిమా విషయంలో తమ్ముడు తమ్ముడే పేకాట పేకాటే అంటున్నారు అల్లు అరవింద్. సొంత కొడుకైనా.. సొంత బ్యానర్ అయినా ఒక నిర్మాతగా హీరోకి ఇవ్వాల్సిన రెమ్యూనరేషన్ ఇచ్చేస్తా అని చిరంజీవితో సినిమాలు చేసినా ఎవరి రెమ్యునరేషన్ వాళ్లకు వారం ముందే సరిపెట్టేయడం తనకు అలవాటు అంటున్నారు అల్లు అరవింద్. ఇంతకీ అల్లు అర్జున్‌కి ఎంత రెమ్యునరేషన్ ఇచ్చారంటే ఆసక్తికరమైన సమాధానం ఇచ్చారు అల్లు అరవింద్.అల వైకుంఠపురములో’ చిత్ర యూనిట్ ప్రచారం ప్రకారం ఈ సినిమా ఇండస్ట్రీ ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ కొట్టింది.
బన్నీ డబ్బులు ఇచ్చేశా : అల్లు అరవింద్
సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ మూవీ అల్లు అర్జున్ కెరియర్‌లోనే కాక.. నాన్ బాహుబలి రికార్డ్‌లన్నింటినీ బ్రేక్ చేసింది. మరోవైపు మహేష్ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రం కూడా ఆల్ టైం బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిందని వీరికి మాదిరే వాళ్లు ప్రచారం చేసుకుంటున్నారు. ఇంతకీ ఈ రెండు చిత్రాల్లో ఏది ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ అన్న విషయాన్ని వారి వారి అభిమాన సంఘాలకు వదిలేస్తే.. ప్రస్తుతం బన్నీ రెమ్యూనరేషన్‌పై అల్లు అరవింద్చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ అవుతున్నాయి.ఈ మూవీ ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ కొట్టడంతో చిత్ర యూనిట్ మీడియా సమావేశం నిర్వహించింది. ఇందులో మీడియా ప్రతినిధులు అడిగిన వివిధ ప్రశ్నలకు సమాధాలు ఇచ్చారు అల్లు అర్జున్, అల్లు అరవింద్, బన్నీ, తమన్‌లు. అయితే ఈ చిత్రానికి అల్లు అరవింద్ నిర్మాత కావడంతో బన్నీకి ఎంత రెమ్యునరేషన్ ఇచ్చారని విలేకరి ప్రశ్నించగా ఆసక్తికరంగా సమాధానం ఇచ్చారు అల్లు అరవింద్.ఈ ప్రశ్నపై మొదట అల్లు అర్జున్ మాట్లాడుతూ.. ‘మా ఫాదర్ ఏ హీరోతో చేస్తే ఆ హీరో అదే కెరియర్ బెస్ట్ మూవీ అవుతుంది. నేను ఆయనతో ‘సరైనోడు’ చేసినప్పుడు ఆ సినిమా నా కెరియర్ బెస్ట్ కలెక్షన్స్ సాధించింది. ఇవాళ ఆయనతో కలిసి ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ కొట్టడం అనేది చిన్న విషయం కాదు.. అందుకే రెమ్యునరేషన్ కూడా దానికి తగ్గట్టుగానే ఉంటుంది’ అంటూ తన తండ్రి దగ్గర నుండి ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నారో చెప్పడానికి సిగ్గు పడ్డారు బన్నీ.అయితే పక్కనే ఉన్న త్రివిక్రమ్ మైక్ అందుకుని ‘మీడియా అందరి తరుపున బన్నీగారి రెమ్యునరేషన్‌పై ఓ వినతి పత్రం గీతా ఆర్ట్స్‌కి పంపించాలని కోరుతున్నా’ అని అన్నారు.ఇక అల్లు అరవింద్ మైక్ తీసుకుని రెమ్యునరేషన్‌పై అసలు విషయం చెప్పారు. ‘నేను బన్నీ తండ్రీ కొడుకులుగా చాలా మంచిగా ఉంటాం.. మంచి ఫ్రెండ్స్‌గా ఒకే ఇంట్లో ఉంటాం. కాని ప్రొఫెషనల్ విషయానికి వచ్చేసరికి చాలా టైట్‌గా ఉంటాం. చిరంజీవి గారి దగ్గర నుండి ఇప్పటి వరకూ రిలీజ్‌కి వారం రోజుల ముందే వాళ్ల రెమ్యునరేషన్ వాళ్ల ఇంటికి పంపించేస్తా. ఇది నా అలవాటు. ఇది బన్నీ విషయంలో కూడా తప్పలేదు.మొదట్లో ఇదేంటి? మనం అంతా అదీ ఇదీ అని బన్నీ చెప్పాడు. కాని ఇది వేరు.. అది వేరు ఇది వేరు. ప్రొఫెషన్ అని చెప్పి బన్నీకి డబ్బులు పంపించేశా’ అని చెప్పారు అల్లు అరవింద్. అయితే ఇంతకీ ఎంత పంపించారు అని మిడియా ప్రతినిధులు అడగ్గా.. రూ. 100 కోట్లు అని ఆన్సర్ ఇచ్చి తెగ నవ్వేశారు అరవింద్.