చేవెళ్లలో ఏసీపీ కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రులు మహమూద్ అలీ సబితా ఇంద్రారెడ్డి - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

చేవెళ్లలో ఏసీపీ కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రులు మహమూద్ అలీ సబితా ఇంద్రారెడ్డి

రంగారెడ్డి జనవరి 29 (way2newstv.com)
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల లో ఏసీపీ కార్యాలయాన్ని   తెలంగాణ హోంశాఖ మంత్రి మహమూద్ అలీ, విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి బుధవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య, జిల్లా పరిషత్ చైర్మన్  తీగల అనితారెడ్డి, పోలీస్ కార్పొరేషన్  చైర్మన్  దామోదర్ గుప్తా, సైబరాబాద్ కమిషనర్ సజ్జనార్, శంషాబాద్ డీసీపీ ప్రకాష్ రెడ్డి, చేవెళ్ల ఆర్డీవో హన్మంత్ రెడ్డి  చేవెళ్ల నియోజకవర్గ పోలీస్ అధికారులు పాల్గొన్నారు.హోం మంత్రి మాట్లాడుతూ చేవెళ్ళ లో నూతనంగా ఏసీపీ కార్యాలయాన్ని ప్రారంభించడం ఆనందంగా ఉందని పోలీసులు మరియు షి టీం బృందాలు ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటున్నారని టెక్నాలజీ సహాయంతో తొందరగా నేరాలను చేధిస్తున్నారని అన్నారు. 
చేవెళ్లలో  ఏసీపీ కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రులు మహమూద్ అలీ సబితా ఇంద్రారెడ్డి

తెలంగాణ పోలీసులు దేశంలోనే ఉత్తమ పోలీసులు గా నిలిచారని తెలంగాణ దేశంలోనే నెంబర్ 1 స్థానంలో నిలిచిందని అందులో సైబరాబాద్ పోలీసులు ముందు స్థానంలో ఉంటారని అన్నారు .సైబరాబాద్ కమిషనర్ సజ్జనార్ ను పొగడ్తలతో ముంచెత్తారు. సజ్జనార్ డైనమిక్ పొలీస్ అధికారి అని అన్నారు.విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి మాట్లాడుతూ చేవెళ్ల లో ఏసీపీ కార్యాలయాన్ని ప్రారంభించడం ఆనందంగా ఉందని తెలంగాణ పోలీసులు దేశంలో ప్రత్యేక స్థానం ఉందని ఈరోజు ప్రజల్లో పొలీస్ స్టేషన్ కు వస్తే న్యాయం జరుగుతుంది అనే నమ్మకం ఏర్పడిందని ఇంట్లో గొడవలు అయితే ఇంట్లో మాట్లాడకుండా   నేరుగా పోలీస్ స్టేషన్లో పిర్యాదు లు చేస్తున్నారని అన్నారు సీఎం కేసీఆర్ నాయకత్వం లో తెలంగాణ లో మహిళల రక్షణ కు షి టీం బృందాలు ఏర్పాటు చేయడం వల్ల నేరాలు అత్యాచారాలు అదుపులో ఉన్నాయని అన్నారు.చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య మాట్లాడుతూ చేవెళ్లలో ఏసీపీ కార్యాలయాన్ని ప్రారంభించడం సంతోషంగా ఉందని అన్నారు చేవెళ్ల నియోజకవర్గ పరిధిలో పలు సమస్యలను హోంమంత్రి మహమూద్ అలీ దృష్టికి తీసుకువచ్చారు  శంకర్ పల్లి మండలం లోని జన్వాడ గ్రామం నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నందున ప్రజలు సమస్యలు ఎదుర్కొంటున్నారాని అలాగే  మొయినాబాద్ మండలం రాజేంద్ర నగర్ జోన్ లో ఉందని దాన్ని శంషాబాద్ జోన్ కి మార్చాలని కోరారు వెంటనే ఆయన  సమస్యలు ఏమి ఉన్న పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.