తిరుపతి దేవస్థానం లో మంత్రి హరీష్ రావుకు ఘోరఅవమానం

హైదరాబాద్ జనవరి 6 (way2newstv.com)
తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ప్రోటోకాల్ పాటించకుండా తెలంగాణ రాష్ట్ర ఆర్ధిక మంత్రి టి.హరీష్ రావును ఘోరంగా అవమానించారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా వెంటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు ఆయన నేడు తిరుమల విచ్చేశారు. అయితే టీటీడీ అధికారులు ఆయనకు ప్రోటోకాల్ పాటించకపోవడం వివాదానికి తావిచ్చింది. దీనిపై మంత్రి హరీశ్ అసహనం వ్యక్తం చేశారు. దర్శనం చేసుకోకుండానే వెనుదిరగాలని భావించారు.
తిరుపతి దేవస్థానం లో మంత్రి హరీష్ రావుకు ఘోరఅవమానం

అయితే అక్కడే ఉన్న టీటీడీ బోర్డు మెంబర్ దామోదర్ కలగజేసుకుని సర్ది చెప్పారు. దీంతో ఆయన శ్రీవారి దర్శనం చేసుకున్నారు. పక్క రాష్ట్రం మంత్రి అయినప్పటికీ ప్రోటోకాల్ పాటించాల్సి ఉంటుంది. అయితే ఇవాళ భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్న దృష్ట్యా వీఐపీలకు ఎక్కువ ఏర్పాట్లు చెయ్యలేకపోయామని, అందరూ అర్ధం చేసుకోవాలని టీటీడీ అధికారులు చెప్పారు.
Previous Post Next Post