మంత్రి మల్లారెడ్డి, మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి బహిరంగం ఘర్షణ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

మంత్రి మల్లారెడ్డి, మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి బహిరంగం ఘర్షణ

హైదరాబాద్ జనవరి 4(way2newstv.com)
మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో టిఆర్ఎస్ మున్సిపల్ ఎన్నికల సన్నాహక సభ లో మంత్రి మల్లారెడ్డి, మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి బహిరంగంగానే ఘర్షణ పడ్డారు. 2014 నుంచి 2018 వరకు మేడ్చల్ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా పనిచేసిన మల్లిపెద్ది సుధీర్ రెడ్డి కి మేడ్చల్ టికెట్ ఇవ్వకుండా మల్లారెడ్డి కి ఇచ్చారు. అప్పటి నుంచి అసంతృప్తిగా ఉన్న సుధీర్ రెడ్డి తిరుగుబాటు చేశారు.ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన రాష్ట్ర ఆర్ధిక మంత్రి హరీష్ రావు ముందే వీరిద్దరూ వాగ్వాదానికి దిగడంతో టిఆర్ఎస్ శ్రేణులు ఒక్క సారిగా ఆశ్చర్యానికి గురయ్యాయి. 
మంత్రి మల్లారెడ్డి, మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి బహిరంగం ఘర్షణ

మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో తన వర్గం నాయకులను దూరం పెడుతూ మంత్రి మల్లారెడ్డి తన ఇష్టానుసారంగా టికెట్ల కేటాయింపు చేసే ప్రయత్నం చేస్తున్నారని పార్టీ కోసం ముందు నుంచి కష్టపడ్డ కార్యకర్తలకు గుర్తింపు లేకపోతే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి నదేనని సుధీర్ రెడ్డి తెలిపారు. అనంతరం మంత్రి మల్లారెడ్డి ప్రసంగం తర్వాత కూడా ఇద్దరూ నిండు సభలో ఒకపక్క మంత్రి హరీష్ రావు మాట్లాడుతుండగానే మాటల దాడి చేసుకోవడంతో పక్కనే ఉన్న వారందరూ అవాక్కయ్యారు. భారీ ఎత్తున సభ ఏర్పాటు చేసి మున్సిపల్ ఎన్నికల కోసం ప్రజల్లోకి వెళ్లాలనుకున్న టిఆర్ఎస్ పార్టీ లో ఇలా కుమ్ములాడుకోవడంతో మునిసిపల్ ఎన్నికలలో ఎదురుదెబ్బ తగులుతుందేమోనని టిఆర్ఎస్ అభిమానులు ఆందోళన చెందుతున్నారు.