విజయవాడలో కనిపించని వంకాయ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

విజయవాడలో కనిపించని వంకాయ

విజయవాడ, జనవరి 4, (way2newstv.com)
కొన్నేళ్ళ క్రితం లేదా కొన్ని దశాబ్దాల క్రితం, బెజవాడ పక్కన కానూరు గ్రామం వంకాయలకు ప్రసిద్ధి. “కానూరు వంకాయ” అంటే ఎగబడి కొనేవాళ్ళు. ఏదో పనిమీద బెజవాడ వచ్చిన వాళ్ళు తిరుగు ప్రయాణంలో కానూరు వంకాయ కొనుక్కొని వెళ్ళేవారని కొందరు పెద్దలు చెప్పగా విన్నాను. కానీ ఇప్పుడు ఆ వంకాయ లేదు. ఆ పొలాల్లో కాలనీలు వచ్చేశాయి. అది కాలానుగుణంగా జరిగిన పరిణామం. అంతేకానీ పనిగట్టుకొని పంటను ధ్వంసం చేయలేదు. కాలానుగుణంగా వచ్చే అవసరాలను, ఆ అవసరాలకు అనుగుణంగా జరిగే పరిణామాలను ప్రకృతి కూడా అంగీకరిస్తుంది. ప్రకృతి మన అవసరాలకు మాత్రమే ఏం చేసినా సహిస్తుంది. ప్రజలు తమ అవసరాల కోసం పంట భూములను ఇళ్ళస్థలాలుగానో, మరో రకంగానో మార్చేస్తూ ఉంటారు. 
విజయవాడలో కనిపించని వంకాయ

అయితే ఈ చర్య మూకుమ్మడిగా ఒక్కసారిగా జరిగిపోదు. నెమ్మదిగా, అవసరానికి తగ్గట్టుగా జరిగిపోతూ ఉంటుంది. అటువంటి చర్యలను ప్రకృతి జీర్ణించుకుంటుంది.తుళ్ళూరు మండలం రాయపూడి నిమ్మకాయలకు ప్రసిద్ధి. ఒకప్పుడు రాయపూడి నిమ్మకాయలంటే ఢిల్లీ, ముంబయి మార్కెట్లో అత్యధిక ధర పలికేది. కానీ ఇప్పుడు రాయపూడి మాత్రమే మిగిలింది. దాని నిమ్మకాయ వెళ్ళిపోయింది. ఇబ్రహీంపట్నంలో ధర్మల్ విద్యుత్ కేంద్రం నిర్మాణం తర్వాత దానిలో నుండి వెలువడే బొగ్గు ధూళి రాయపూడి నిమ్మకాయను ధ్వంసం చేసింది. రైతులు నిమ్మపంటను నెమ్మదిగా తగ్గించుకున్నారు. రాయపూడి నిమ్మకాయా?, ఇబ్రహీంపట్నం విద్యుత్ కేంద్రమా అన్నప్పుడు విద్యుత్ కోసం నిమ్మకాయను వదిలేసుకుంటాం. అది సామాజిక అవసరం. దానికి ప్రత్యామ్నాయం లేదు.పంటలు మాత్రమే కాదు, జనావాసాలు కూడా అలా అంతరించి పోతూ ఉంటాయి. బెజవాడ బందరు రోడ్డు పక్కన ఉన్న అనేక పేదల పూరిగుడిశసెలు (మురికివాడలు అనడానికి ఇష్టపడను) ఇప్పుడు కనిపించవు. ఎన్టీఆర్ సర్కిల్ కి సర్వోత్తమ గ్రంథాలయానికి మధ్యన ఉండే చిన్న కాలనీ, శేషశాయి కళ్యాణ మంటపానికి మున్సిపల్ కాలనీకి మధ్యన ఉండే చిన్న కాలనీ, గేట్ వే హోటల్ ఎదురుగ ఉండే చిన్న కాలనీ, ఇలా అనేక పేదల కాలనీలు బెజవాడ నగరం అభివృద్ధి చెందే క్రమంలో మాయం అయ్యాయి. ఇప్పుడిప్పుడే పిన్నమనేని క్లినిక్ రోడ్డులో ఉండే కాలనీ మాయం అవుతోంది. సమాజ అవసరాల కోసం జరిగే పరిణామాలను సమాజం అర్ధం చేసుకుంటుంది. ఇలాంటి చర్యలు అనేకం జరుగుతూ ఉంటాయి. వాటిని ప్రకృతి తిరస్కరించదు, వ్యతిరేకించదు. అవసరాలకు మించి అత్యాశలకుపోయి చేసే చర్యలను మాత్రమే తిరస్కరిస్తుంది. అత్యాశలకుపోయి చేసే విధ్వంసకర చర్యలను ప్రకృతితో పాటు కొందరు విజ్ఞులైన ప్రజలు కూడా వ్యతిరేకిస్తారు.కానూరు వంకాయ అయినా, రాయపూడి నిమ్మకాయ అయినా, బెజవాడ బందరు రోడ్డులోని కాలనీలు అయినా క్రమంగా అంతం అయిపోయినవే. పొలాలు పోయి ఇళ్ళు వస్తాయి. పంటలు పోయి మనుషులు వస్తారు. కాలనీల్లో పాకలు (స్థానికులు) పోయి భవనాలు వస్తాయి. అక్కడ ప్రతిఘటన ఉండదు. సహజ పరిణామాన్ని, పరిణామ క్రమాన్ని ప్రజలు అంగీకరిస్తారు. అయితే పంటలు కానీ, జనావాసాలు కానీ సామూహికంగా, బలవంతంగా ఖాళీ చేయించాల్సి వస్తే?