విశాఖపట్టణం, జనవరి 7 (way2newstv.com)
మూడు రాజధానుల దిశగా జగన్ సర్కారు వడి వడిగా అడుగులు వేస్తోందని సమాచారం. ఇప్పటికే జీఎన్ రావు కమిటీ, బీసీజీ రిపోర్ట్ రాజధాని వికేంద్రీకరణకు అనుకూలంగా నివేదిక ఇవ్వగా.. ఈ రెండు రిపోర్టులను హైపవర్ కమిటీ విశ్లేషించి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది. కాగా.. రాజధానులపై ప్రకటన చేయడం కోసం ఈ నెల 20 లేదా 21న అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశమయ్యే అవకాశం ఉందని సమాచారం.విశాఖకు సెక్రటేరియేట్‌ను తరలించే ప్రయత్నాల్లో జగన్ సర్కారు ఉందని ప్రచారం జరుగుతోంది. విడతల వారీగా సచివాలయాన్ని తరలించే ప్రయత్నాల్లో ప్రభుత్వం ఉందని సమాచారం. న్యాయపరంగా ఎలాంటి చిక్కులు లేకుండా ముందుకెళ్లాలని జగన్ సర్కారు భావిస్తున్నట్టు తెలుస్తోంది.
ఈసారి రిపబ్లిక్ విశాఖలోనే
విశాఖలోని మిలీనియం టవర్స్‌లో సచివాలయాన్ని ఏర్పాటు చేయనున్నట్టు వార్తలొస్తున్నాయి.జనవరి 20 నుంచే మిలీనియం టవర్స్‌లో సచివాలయం ఏర్పాటు అవుతుందని.. దీనికి త్వరలోనే కేబినెట్ ఆమోదం తెలిపే ఛాన్సు ఉందని సమాచారం. జీఏడీ నుంచి మూడు సెక్షన్లు, ఫైనాన్స్ నుంచి రెండు సెక్షన్లు, మైనింగ్ నుంచి రెండు, హోం శాఖ నుంచి నాలుగు, ఉన్నత విద్య, పాఠశాల విద్య నుంచి రెండేసి సెక్షన్లు.. రోడ్లు భవనాలు, ఆరోగ్య శాఖల నుంచి నాలుగేసి సెక్షన్ల చొప్పున విశాఖకు తరలిస్తారని... 34 శాఖల నుంచి కీలక సెక్షన్ల తరలింపు దిశగా కసరత్తు జరుగుతోందని ప్రచారం జరుగుతోంది.విశాఖలోనే రిపబ్లికే పరేడ్ నిర్వహిచే యోచనలో జగన్ సర్కారు ఉందని కూడా టాక్ నడుస్తోంది. ఇందుకు సంబంధించి ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది.