దావోస్ సమావేశాల్లో మంత్రి కేటీఆర్ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

దావోస్ సమావేశాల్లో మంత్రి కేటీఆర్

దావోస్ జనవరి 21 (way2newstv.com)
వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశాల్లో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ పాల్గోంటున్నారు. ఈ సమావేశాలకోసం అయన సోమవారం  స్విట్జర్లాండ్లోని దావోస్కు చేరుకున్నారు. దావోస్ పర్యటనలో భాగంగా అపోలో టైర్స్ వైస్ చైర్మన్, ఎండీ నీరజ్ కుమార్తో మంత్రి కేటీఆర్ సమావేశమై తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు.  హెచ్పీఈ సీవోవో విశాల్ లాల్తో కూడా కేటీఆర్ సమావేశమయ్యారు.  ఈ సందర్భంగా తెలంగాణలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలపై మంత్రి కేటీఆర్ వారికి వివరించారు.  
దావోస్ సమావేశాల్లో మంత్రి కేటీఆర్

సోమవారం ప్రారంభమైన 50వ ప్రపంచ ఆర్థిక వేదిక సమావేశాలు 24వ తేదీ వరకు జరుగనున్నాయి.  ఇందులో టెక్నాలజీ ప్రయోజనాలు- ఎదురయ్యే సవాళ్లపై చర్చ జరుగనున్నది.  నాలుగో పారిశ్రామిక విప్లవంలో సాంకేతిక ప్రయోజనాలు- సవాళ్లను నివారించడం అనే అంశంపై మంత్రి కేటీఆర్ ప్రసంగిస్తారు.  సాంకేతికత వినియోగంలో తెలంగాణ ప్రభుత్వ ప్రగతిని వివరిస్తారు.  సమావేశాల సందర్భంగా ప్రపంచదేశాలకు చెందిన అనేకమంది పారిశ్రామికవేత్తలతో కేటీఆర్ భేటీ కానున్నారు.  రాష్ట్రంలో ఫార్మాసిటీ, టెక్స్టైల్ పార్క్, జీనోమ్ వ్యాలీ, మెడికల్ డివైజెస్ పార్క్, కృత్రిమ మేధ, ఎలక్ట్రానిక్ సహా పలురంగాల్లో పెట్టుబడులను ఆహ్వానించనున్నారు.