సైయెంట్‌, టెక్‌ మహీంద్రా క్యాంపస్‌లను ప్రారంభించిన కేటీఆర్‌

వరంగల్‌ జనవరి 7 (way2newstv.com)
హైదరాబాద్‌ తర్వాత రెండో అతిపెద్ద నగరమైన వరంగల్‌.. ఐటీ రంగంలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకుంది. మడికొండలోని ఐటీ పార్క్‌ లో సైయెంట్‌, టెక్‌ మహీంద్రా క్యాంపస్‌లను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. అత్యాధునిక హంగులతో 5 ఎకరాల్లో సైయెంట్‌ నూతన భవనాన్ని నిర్మించారు. 600 నుంచి 700 మంది ఉద్యోగులతో సేవలు అందించేందుకు వీలుగా భవన నిర్మాణం చేపట్టారు. టెక్‌ మహీంద్రాలో 100 మంది ఉద్యోగులు విధులు నిర్వర్తించనున్నారు. 
సైయెంట్‌, టెక్‌ మహీంద్రా క్యాంపస్‌లను ప్రారంభించిన కేటీఆర్‌

2016 ఫిబ్రవరిలో వరంగల్‌ ఐటీ సెజ్‌లో ఇంక్యుబేషన్‌ సెంటర్‌ను కేటీఆర్‌ ప్రారంభించారు. ఐటీ సేవల కోసం 27 ఎకరాల్లో ప్రత్యేక ఆర్థిక మండలిని ప్రభుత్వం అభివృద్ధి చేసింది. మొదటి దశలో భాగంగా 2017లో 5 ఎకరాల్లో మూడు కంపెనీలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సైయెంట్‌, టెక్‌ మహీంద్రా ప్రతినిధులు, మంత్రులు సత్యవతి రాథోడ్‌, ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఈటల రాజేందర్‌, ఉమ్మడి వరంగల్‌ జిల్లాకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.
Previous Post Next Post