చట్టం కల్పించిన హక్కును తాము వినియోగించుకున్నాం - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

చట్టం కల్పించిన హక్కును తాము వినియోగించుకున్నాం

ఎక్స్‌ అఫీషియో ఓటు హక్కు వినియోగంపై మంత్రి కేటీఆర్‌
హైదరాబాద్‌ జనవరి 27(way2newstv.com)
మున్సిపాలిటీల ఛైర్మన్‌, వైస్‌ ఛైర్మన్‌ ఎన్నికల విషయంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాజ్యసభ సభ్యుల ఎక్స్‌అఫీషియో ఓటు హక్కు వినియోగంపై విలేకరులు అడిగిన ప్రశ్నలకు మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ సవివరంగా సమాధానం ఇచ్చారు. తెలంగాణ భవన్‌లో కేటీఆర్‌ మీడియాతో మాట్లాడుతారు. ఎక్స్‌అఫీషియో సభ్యులకు ఓటింగ్‌ విధానం తాము తీసుకువచ్చింది కాదు అని కేటీఆర్‌ స్పష్టం చేశారు. ఎక్స్‌అఫీషియో మెంబర్స్‌ అనే చట్టాన్ని తాము తీసుకురాలేదన్నారు మంత్రి. 1999లో నాటి టీడీపీ ప్రభుత్వం.. ఎమ్మెల్యేలకు ఎక్స్‌అఫీషియో ఓటు హక్కు కల్పించింది. 
చట్టం కల్పించిన హక్కును తాము వినియోగించుకున్నాం

2008లో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎమ్మెల్సీలకు ఎక్స్‌అఫీషియో ఓటు హక్కు కల్పించింది అని కేటీఆర్‌ గుర్తు చేశారు.  గత ప్రభుత్వాలు తెచ్చిన చట్టాన్నే తాము వినియోగించుకున్నాం. ఓటు హక్కు వినియోగించుకోవడం అనేది చట్టం కల్పించిన హక్కు. ఆ హక్కును తాము వినియోగించుకున్నాం అని కేటీఆర్‌ పేర్కొన్నారు. ఉన్న చట్టం ప్రకారం ఎక్స్‌అఫీషియో సభ్యులకు ఓట్లు ఉన్నాయి. తామేం ఆ చట్టాన్ని మార్చలేదు. రాజ్యసభ సభ్యులు ఎక్కడైనా ఓటేయొచ్చు. శాసనసభ సభ్యుల కోటాలో ఎన్నికైన ఎమ్మెల్సీలు కూడా ఎక్కడైనా ఓటేయొచ్చు. దాని ప్రకారమే ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు అని కేటీఆర్‌ తెలిపారు. నిజామాబాద్‌ కార్పొరేషన్‌లో సహకరించిన ఎంఐఎంకు ధన్యవాదాలు చెప్పారు కేటీఆర్‌. పార్టీ రెబల్స్‌ విషయంలో కఠినంగానే వ్యవహరిస్తున్నాం. టీఆర్‌ఎస్‌ దెబ్బకు పరస్పర విరుద్ధమైన పార్టీలు కలిసిపోయాయి. ఏ పార్టీ ఎవరికి బి-టీమ్‌ అనేది ఇవాళ ప్రజలకు అర్థమైంది అని కేటీఆర్‌ అన్నారు.