షాకిచ్చిన బంగారం ధర.. వెండి మాత్రం. - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

షాకిచ్చిన బంగారం ధర.. వెండి మాత్రం.

ముంబై, జనవరి 2  (way2newstv.com)
పసిడి ధర తగ్గుదలకు బ్రేకులు పడ్డాయి. రెండు రోజులుగా పడిపోతూ వచ్చిన బంగారం ధర ఈ రోజు పైకి కదిలింది. భారీగానే పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడి ధర బలహీనంగా ఉన్నప్పటికీ దేశీ జువెలర్లు, రిటైలర్ల నుంచి డిమాండ్ పుంజుకోవడంతో బంగారం ధరపై సానుకూల ప్రభావం పడిందని నిపుణులు పేర్కొంటున్నాయి.హైదరాబాద్ మార్కెట్‌లో గురువారం బంగారం ధర పెరిగింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ.130 పరుగులు పెట్టింది. దీంతో బంగారం ధర రూ.37,350కు చేరింది. అదేసమయంలో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.90 పెరుగుదలతో రూ.40,750కు ఎగసిందిబంగారం ధర గత రెండు రోజులుగా తగ్గుతూ వచ్చింది. అయితే దీని కన్నా ముందు 2 వారాలుగా పసిడి పరుగులు పెడుతూనే వచ్చింది. 
షాకిచ్చిన బంగారం ధర.. వెండి మాత్రం.

ఈ కాలంలో పసిడి ధర 10 గ్రాములకు రూ.1,300కు పైగానే పెరిగింది. డిసెంబర్ 11న 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.35,910 వద్ద ఉంది. అదేసమయంలో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.39,170 వద్ద ఉంది.బంగారం ధర పెరిగితే వెండి ధర మాత్రం స్థిరంగానే కొనసాగింది. కేజీ వెండి ధరలో ఎలాంటి మార్పు లేదు. దీంతో ధర రూ.49,350 వద్దనే నిలకడగానే కొనసాగుతోంది. ఐదు రోజులుగా పెరుగుతూ వచ్చిన వెండి ధర తగ్గి, పెరిగి ఈరోజు స్థిరంగా కొనసాగడం గమనార్హం.అంతర్జాతీయంగా బలహీనమైన ట్రెండ్ ఉన్నా కూడా దేశీ మార్కెట్‌లో మాత్రం డిమాండ్ జోరందుకుందని చెప్పుకోవచ్చు. పండుగ సీజన్, పెళ్లిళ్ల సీజన్ ఇందుకు ప్రధాన కారణం. అందుకే బంగారం ధర పరుగులు పడుతోందని నిపుణులు పేర్కొంటున్నారుఢిల్లీ మార్కెట్‌లో మాత్రం బంగారం ధర మిశ్రమంగా స్పందించింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర మాత్రం పైకి కదిలింది. రూ.100 పెరిగింది. దీంతో ధర రూ.38,150కు చేరింది. అలాగే 24 క్యారెట్ల బంగారం ధర మాత్రం రూ.100 తగ్గింది. దీంతో ధర రూ.39,150కు క్షీణించింది. కానీ కేజీ వెండి ధర నిలకడగానే కొనసాగింది. దీంతో ధర రూ.49,350 వద్దనే స్థిరంగా ఉంది.ఇకపోతే అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర తగ్గింది. ఔన్స్‌కు 0.09 శాతం తగ్గుదలతో 1,521.65 డాలర్లకు క్షీణించింది. అదేసమయంలో వెండి ధర ఔన్స్‌‌కు 0.07 శాతం పెరుగుదతో 17.93 డాలర్లకు తగ్గిందిగ్లోబల్ మార్కెట్‌లో బంగారం ధర సెప్టెంబర్ నెలల్లో ఏకంగా ఆరేళ్ల గరిష్ట స్థాయి చేరింది అమెరికా, చైనా మధ్య నెలకొన్ని వాణిజ్య ఉద్రిక్తతలు ఇందుకు కారణం. అయితే అప్పటితో పోలిస్తే ప్రస్తుతం బంగారం ధర కింది స్థాయిల్లోనే కదలాడుతోంది.మరోవైపు దేశీ మార్కెట్‌లో బంగారం ధర ఈ ఏడాది దాదాపు 22 శాతానికి పైగా పరుగులు పెట్టింది. బంగారంపై దిగుమతి సుంకాల పెంపు, అమెరికా డాలర్‌తో పోలిస్తే ఇండియన్ రూపాయి బలహీనపడటం, అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడి ధర పరుగులు పెట్టడం వంటి పలు అంశాలు ఇందుకు ప్రధాన కారణంబంగారం ధరలపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు పసిడి ధరపై ప్రభావం చూపుతాయి.