అసౌకర్యాలకు అడ్డగా రైల్వేస్టేషన్లు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

అసౌకర్యాలకు అడ్డగా రైల్వేస్టేషన్లు

హైద్రాబాద్, జనవరి 24, (way2newstv.com)
వేలాది మందిని గమ్యస్థానాలకు చేర్చుతున్న రైల్వే స్టేషన్లు రాత్రి అయితే చాలు మందుబాబులకు అడ్డాలుగా మారుతున్నాయి. అసాంఘిక కార్యకలాపాలకు కేంద్రాలవుతున్నాయి. తాగి పారేసిన సీసాలతో ప్లాట్‌ఫాంలు దర్శనమిస్తున్నాయి. నగరంలోని జామ్‌ ఉస్మానియా, విద్యా నగర్‌ రైల్వేస్టేషన్‌ల్లో దుస్థితే దీనికి నిదర్శనం. చీకటి పడితే చాలు రైల్వే స్టేషన్‌లోని మెట్లపై కొంతమంది మద్యం సేవిస్తున్నారు. ఆ సీసాలను ఇష్టారాజ్యంగా విసి రస్తున్నారు. రాత్రి సమయంలో స్టేషన్‌కు వచ్చే వారు వీరి ఆగడాలను చూసి భయపడుతున్నారు. మహిళలు స్టేషన్‌కు వెళ్లాలంటే భయపడే పరిస్థితి నెలకొన్నది అంటే సమస్య ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకో వచ్చు. నిత్యం రద్దీగా ఉండే ప్రాతంలోనే ఇలా ఉంటే మామూలు స్టేషన్లలో పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. సంబంధిత అధికారులు కనీస చర్యలు తీసుకోవడంలో విఫలమవుతున్నారని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు.
అసౌకర్యాలకు అడ్డగా రైల్వేస్టేషన్లు

ఉదయం, సాయంత్రం ఈ ప్లాట్‌ఫాంల పైకి వాకర్స్‌ వస్తుంటారు. ప్లాట్‌ఫాంలపై ఉన్న మందుబాబులు మహిళా వాకర్స్‌ పట్ల అసభ్యంగా ప్రవరిస్తున్నారు. సెక్యూరిటీ కూడా లేకపోవడంతో వారి ఆగడాలకు అడ్డూ అదుపు లేకుండా పోతోందని స్థానిక ప్రజలు వాపోతున్నారు. వారం రోజుల కింద మద్యం మత్తులో రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణ నెత్తురు వచ్చేలా దాడి చేసుకునే వరకూ వెళ్లింది. కొంతమంది తృటిలో ప్రాణాపాయం నుంచి భయట పడ్డారు. రాత్రి సమయాల్లో రైల్వే స్టేషన్‌ ఆవరణలో ఆకతాయిలు గంజాయి వంటి మత్తు పదార్థాలు సేవిస్తూ వికృత చేష్టలు చేస్తున్నారని ప్రయాణికులు చెబుతున్నారు. ఆకతాయిల ఆగడాలకు అడ్డుకట్ట వేసి పోలీసు నిఘాను పెంచాలని బస్తీవాసులు కోరుతున్నారు.రైల్వే స్టేషన్లలో కనీస సౌకర్యాలు లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. జామై ఉస్మానియా స్టేషన్‌లో గతంలో ఉన్నటికెట్‌ కౌంటర్‌ను రిజర్వేషన్‌ కౌంటర్‌గా చేశారు. దీంతో ప్రయాణికులు ట్రాక్‌ దాటి ప్లాట్‌ఫాం పైకి వెళ్లి టికెట్‌ తీసుకోవాల్సిన పరిస్థితి నెలకొన్నది. వయసు పైబడిన వారికి ఇది తీవ్ర ఇబ్బందిగా మారింది. స్క్రాచ్‌ కార్డు ద్వారా టికెట్‌ తీసుకునేందుకు ఏర్పాటుచేసిన ఏటీఎం తరచూ పాడవుతుండడంతో ఇబ్బందులు తప్పట్లేదు. టికెట్‌ కోసం ట్రాక్‌ దాటతుంటే ప్రమాదాల భారీన కూడా పడుతున్నారు. అధికారులు స్పందించి వెంటనే పరిష్కరించా ల్సిందిగా కోరుతున్నారు.స్టేషన్‌లో ఉన్న మరగుదొడ్లు ఉపయోగించలేని స్థితిలో ఉన్నాయి. ప్లాట్‌ఫాంలో ఫ్యాన్లు లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.తాగునీటి కుళాయిలు పనిచేయడం లేదు దీంతో ప్రయాణికులకు తాగునీరు కూడా దొరకని దుస్థితి నెలకొన్నది. కొన్ని కుళాయిలను ఏర్పాటు చేసిన ఎండకు నీళ్లు వేడవుతుండడంతో తాగలేని పరిస్థితి. అధి కారులు వెంటనే స్పందించి ప్రయాణికులకు తాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.