ఎమ్మెల్యే ఆర్కే ఆరెస్టు
గుంటూరు జనవరి 13, (way2newstv.com)
రాష్ట్రంలో అధికార వికేంద్రీకరణ జరగాలని డిమాండ్ చేస్తూ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి(ఆర్కే) ఆధ్వర్యంలో సోమవారం గుంటూరు జిల్లా పెనుమాక నుంచి తాడేపల్లి భారతమాత విగ్రహం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు.
మూడు రాజధానులకు మద్దతు ర్యాలీ
నిషేధాజ్ఞలు ఉన్నందున ర్యాలీకు అనుమతి లేదని స్పష్టం చేసారు. ర్యాలీ నేపథ్యంలో భారీగా పోలీసులను మొహరించారు. ఎమ్మెల్యే ఆర్కేను పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. ఆయనకు మద్దతుగా వచ్చిన మహిళలు, నాయకులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.