టీఆర్ఎస్ పార్టీ వైఖరికి నిరసనగా తుక్కుగూడ మున్సిపాలిటీలో బంద్

హైదరాబాద్ జనవరి 28  (way2newstv.com)
తుక్కుగూడ  మున్సిపాలిటీలో అడ్డదారిలో అధికారం చేజిక్కించుకున్న టీఆర్ఎస్ పార్టీ వైఖరికి నిరసనగా నేడు బీజేపీ రంగారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో బంద్ జరుగుతున్నది.  ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ  ప్రజాస్వామ్యబద్ధంగా  గెలిచినా కూడా  టిఆర్ఎస్ పార్టీ రాజ్యాంగ  విలువలను  తుంగలో తొక్కిందని బీజేపీ రోపించింది.ప్రజాస్వామ్యానికి  వ్యతిరేకంగా మున్సిపాలిటీ చైర్మన్ ని  ఎన్నుకున్న టీఆర్ఎస్ పార్టీ వైఖరిని బీజేపీ ఖండించింది. 
టీఆర్ఎస్ పార్టీ వైఖరికి నిరసనగా తుక్కుగూడ మున్సిపాలిటీలో బంద్

బీజేపీ రంగారెడ్డి జిల్లా నాయకత్వం పిలుపు మేరకు తుక్కుగూడ మున్సిపాలిటీ  బంద్ జరుగుతున్నది. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు జనార్దన్ రెడ్డి, బొక్క నర్సింహారెడ్డి, వీరేందర్ గౌడ్, బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జ్ఞానేంద్ర ప్రసాద్ తుక్కుగుడా మున్సిపాలిటీ  కౌన్సిలర్స్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Previous Post Next Post