వాషింగ్టన్ జనవరి 28 (way2newstv.com)
అమెరికాలోని అలబామాలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది.ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు ఈ ప్రమాదం లో ఎనిమిది మంది మృతిచెందారు. ఉత్తర అలబామాలో అమెరికా కాలమానం ప్రకారం సోమవారం వేకువ జామున టెన్నెస్సీ నదీ తీరం వెంబడి ఉన్న బోటు డాక్‌యార్డులో ఈ ఘటన చోటుచేసుకుంది. దాదాపు 35 పడవలు మంటల్లో చిక్కుకున్నట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.స్కాట్స్‌బోరో అగ్నిమాపక అధికారి జెనె నెక్లాస్ దీనిని ధ్రువీకరిస్తూ చాలా మంది గల్లంతయ్యారని, పడవల్లో ఎంత మంది ఉన్నారో తెలియదని, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పారు. తీవ్రంగా గాయపడిన మరో ఏడుగురిని ఆస్పత్రికి వైద్య చికిత్స కై తరలించినట్లు ఆయన తెలిపారు.
అమెరికాలోని ఘోర అగ్నిప్రమాదం..ఎనిమిది మంది మృతి
మొదట అర్ధరాత్రి దాటాక జాక్సన్ కంట్రీ పార్క్ లో చెలరేగిన మంటలు పక్కనే ఉన్న డాక్‌యార్డు వైపునకు వేగంగా విస్తరించాయి. పడవల్లో ఎక్కువ మంది గాఢనిద్రలో ఉండడంపడవలు కర్రతో నిర్మితం అయి నందున మంటలు త్వరగా వ్యాపించాయి. పడవలపై ఉండే అల్యూమినియం రేకులు విరిగిపడుతుండటంతో మంటల్లో చిక్కుకున్న వారిని రక్షించే ప్రయత్నాలు ఫలించలేదు.ప్రాణాలు కాపాడుకునేందుకు పలువురు టెన్నెస్సీ నదిలో దూకారు. నీటిలో దూకిన పలువురుని అధికారులు రక్షించారు. 15 నుంచి 20 నిమిషాల్లోపే డాక్‌యార్డ్ మొత్తం మంటల్లో చిక్కుకుందని స్థానికులు తెలిపారు. చాలా పడవల్లో గ్యాస్ ట్యాంకులు ఉన్నట్లు వారు పేర్కొన్నారు. ఇవి గనక పేలితే మరింత తీవ్ర నష్టం జరిగేదని అధికారులు తెలిపారు.