హైదరాబాద్ జనవరి 9 (way2newstv.com)
కేబుల్ వినియోగదారులకు టెలికమ్ రెగ్యూలేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలో కేబుల్ బిల్లులు తగ్గేలా చర్యలు తీసుకుంది. అంతేకాదు.. ఇప్పుటి వరకు ఎంఎస్‌వోలు అందించిన ఉచిత ఛానెల్ల సంఖ్యను కూడా రెండింతలు పెంచనుంది. ఇక కనీస గరిష్ఠ ధరను కూడా ఫిక్స్ చేయనుంది. ఛానెళ్ల రేట్ల పెంపుపై సరికొత్త నిబంధన అమలు చేసే అంశాన్ని పరిశీలిస్తోంది. దీనికి సంబంధించి.. ఎంఎస్‌వోలకు ట్రాయ్ కొత్త గైడ్‌లైన్స్‌ను కూడా విడుదల చేసింది.
కేబుల్ వినియోగదారులకు ట్రాయ్ గుడ్ న్యూస్
ఇక బ్రాడ్ కాస్టర్లు విధించే చానల్ గరిష్ఠ ధరను.. రూ.19 నుంచి రూ. 12కు తగ్గించింది. ఇక నెట్‌వర్క్ కెపాసిటీ ఫీజును రూ.130కి ఫిక్స్ చేసింది.ఇప్పటి వరకు ఉచితంగా వచ్చే 100 ఫ్రీ ఎయిర్ ఛానల్స్‌కి బదులు 200 ఫ్రీ టు ఎయిర్ ఛానల్స్ ఇవ్వాలని సూచించింది. అంతేకాదు.. 200కు మించి ఎన్ని ఫ్రీ ఛానల్స్‌కి అయినా.. రూ.160కి మించి చెల్లించనక్కర్లేదని స్పష్టం చేసింది. డీడీ ఛానల్స్ విషయంలో కూడా క్లారిటీ ఇచ్చింది. 26 డిడి చానల్స్ టారీఫ్‌లో కాకుండా అదనమని ట్రాయ్ పేర్కొంది.ఇక ఇప్పటి వరకు ఒకే ఇంట్లో రెండు కనెక్షన్లు ఉంటే.. రెండింటికి ఒకే ధరను వసూలు చేసేవారు. కానీ కొత్తగా సవరించిన నిబంధనల ప్రకారం. ఇంట్లో రెండో టీవీ ఉంటే దానికి నెట్‌వర్క్ కెపాసిటీ ఫీజు.. 40 శాతం చెల్లిస్తే సరిపోతుందని పేర్కొంది. ఈ కొత్త గైడ్‌లైన్స్‌ను ఈ జనవరి నెలాఖరు నాటికి వెబ్‌సైట్‌లో ఉంచాలని, మార్చి 1నుంచి వీటిని అమలు చేయాలని ఎంఎస్‌వోలను ట్రాయ్ ఆదేశించింది.