హైద్రాబాద్, జనవరి 4, (way2newstv.com)
రాష్ట్రంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ఈ ఏడాది నిరాశే ఎదురైంది. వేతన సవరణ కమిషన్ అమలు కాకపోవడంతో ప్రభుత్వ తీరుపై ఉద్యోగులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఏపీలో మాదిరిగా మధ్యంతర భృతి (ఐఆర్) కూడా ప్రకటించలేదు. పిఆర్‌సి అమలు చేస్తామని చెప్తూనే కాలయాపన చేయడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎంప్లాయి ఫ్రెండ్లీ ప్రభు త్వం మాటల్లోనే తప్ప ఆచరణలో ఎక్కడా కనిపించడం లేదని ఉద్యోగులు, ఉపాధ్యాయులు అభిప్రాయపడు తున్నారు. పీఆర్సీ అమలు, ఐఆర్ ప్రకటన, ఉద్యోగుల ఉద్యోగ విరమణ వయస్సు పెంపు వంటి విషయాల్లో ఎంప్లాయి ఫ్రెండ్లీ ఎక్కడుందని ప్రశ్నిస్తున్నారు. 2020, ఫిబ్రవరి 25వ తేదీ వరకు పీఆర్సీ కమిటీ గడువును ప్రభుత్వం పెంచింది. ప్రభుత్వ నిర్ణయంతో పీఆర్సీ ఇప్పట్లో లేనట్టేనని తేలిపోయింది.
మళ్లీ కనిపించని పీఆర్ సీ
వచ్చేఏడాది ఫిబ్రవరి వరకు గడువు పెంచడంతో కొత్త బడ్జెట్‌లోనే వేతన సవరణ ఉండే అవకాశమున్నట్టు సమాచారం.పీఆర్సీ అమలు ఎంత ఆలస్యం చేస్తే అంత రాష్ట్ర ప్రభుత్వానికే లాభం కలుగుతుంది. ఇదేమిటి అనుకుంటు న్నారా?. పిఆర్‌సి అమలు చేస్తే ఉద్యోగుల జీతాలు, పింఛనర్ల పింఛన్ పెరుగుతుంది. ఆలస్యమైతే పెరిగే ఆ జీతాలు, పింఛన్ సొమ్ము, ప్రభుత్వ ఖజానాలోనే ఉండడం తో ప్రభుత్వానికి లాభం కలుగుతుంది. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా పిఆర్‌సి సకాలంలో అమలు చేయదు. కాంగ్రెస్, తెలుగుదేశం దారిలోనే ఇప్పుడు టిఆర్‌ఎస్ నడుస్తున్నదనడానికి పిఆర్‌సిను అమలు చేయకపోవడమే నిదర్శనం. 2018, జులై 1 నుంచి రాష్ట్రంలో తొలి పిఆర్‌స్సి అమలు కావాలి. ఇప్పటికే 18 నెలలు దాటింది. ఫిబ్రవరి వరకు అంటే పిఆర్‌సి అమలు 20 నెలలు ఆలస్యమయ్యే అవకాశమున్నది. ఫిబ్రవరి నుంచి అమలవుతుందా? అంటే అదీ అనుమానమే. కొత్త బడ్జెట్ ప్రారంభమయ్యే ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త పిఆర్‌సి అమలయ్యే అవకాశమున్నట్టు తెలుస్తున్నది. ఉద్యోగ విరమణ వయస్సు 58 ఏళ్ల నుంచి 61 ఏళ్లకు పెంచుతామన్న హామీ కూడా ఇంకా అమలు కాలేదు. దీంతో రిటైరవుతున్న ఉద్యోగులు, ఉపాధ్యాయులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఆర్టీసీ ఉద్యోగుల ఉద్యోగ విరమణ వయస్సును 58 నుంచి 60 ఏళ్లకు పెంచడంతో ప్రభుత్వ ఉద్యోగుల్లో ఆశలు రేకెత్తాయి. ఉద్యోగుల ఐక్యతను చీల్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కుట్ర చేసింది. ఇటీవల ఆర్టీసీ సమ్మె సమయంలోనే అది బట్టబయలైంది. ఆర్టీసీ సమ్మెపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. దీంతో టీఎన్జీవో, టీజీవో, పీఆర్టీయూ వంటి సంఘాలు ఆర్టీసీ సమ్మెకు మద్దతు ప్రకటించినా ప్రత్యక్ష ఆందోళనల్లో పాల్గొన లేదు