అమరావతి జనవరి 11 (way2newstv.com)
రక్షక భటులే భక్షక భటులయితే సామాన్యుడు ఎవరికి చెప్పుకుంటాడని టీడీపీ అధికార ప్రతినిధి దివ్యవాణి ప్రశ్నించారు. పశువుల కన్నా హీనంగా మాహిళలను ఈడ్చి పారేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి అవంతి శ్రీనివాస్‌కి విశాఖలో ర్యాలీకి ఎలా అనుమతి ఇచ్చారని ప్రశ్నించారు. ఆయన విశాఖ కోసం ర్యాలీ చేశారని... తాము అమరావతి కోసం ర్యాలీ చేస్తున్నామన్నారు.
రక్షకులే భక్షకులయ్యారు
హోం మినిస్టర్, మహిళా కమిషన్ చైర్ పర్శన్‌లు గన్ కన్నా ముందే తమ జగనన్న వస్తారన్నారని.. మహిళల గోడు మీ జగనన్నకి కనపడటం లేదా? అని ప్రశ్నించారు. వైసీపీలో ఒకరేమో పెయిడ్ ఆర్టిస్టులు అంటారని.. మరొకరు పెయిడ్ ఆర్టిసులు కాదు రైతులకు క్షమాపణ చెప్పాలి అంటారని.. ఎవరికి వాళ్ళు గేమ్స్ అడుతున్నారని దివ్యవాణి ఫైర్ అయ్యారు.