కిస్ టీజర్ గబ్బు లేపుతోంది - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

కిస్ టీజర్ గబ్బు లేపుతోంది

హైద్రాబాద్, జనవరి 6 (way2newstv.com)
అడల్ట్, బోల్డ్ కంటెంట్‌తో కూడిన సినిమాలు ఈ మధ్య టాలీవుడ్‌లో బాగా ఎక్కువైపోయాయి. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలోకి కొత్తగా అడుగుపెడుతున్న దర్శక నిర్మాతలు ఇలాంటి సినిమాలపైనే ఎక్కువ దృష్టిపెడుతున్నారు. యూత్‌ను ఆకర్షించేలా బోల్డ్ కంటెంట్ పెట్టి థియేటర్లకు రప్పిస్తున్నారు. దీనికోసం ముందు నుంచే టీజర్, ట్రైలర్ల పేరుతో మితిమీరిన శృంగారాన్ని యూట్యూబ్‌లో చూపించేస్తున్నారు. ఇలాంటి సినిమాలు ఇప్పటికే తెలుగులో చాలా వచ్చాయి. తాజాగా మరొక సినిమా సిద్ధంగా ఉంది.జి.ఎస్‌.కె ప్రొడక్షన్స్ బేనర్‌పై శివ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న రొమాంటిక్ థ్రిల్లర్ ‘కిస్’. ధరన్, నేహా హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రం దెయ్యం వయాగ్రా మింగితే అనే విభిన్నమైన కాన్సెప్ట్‌తో నిర్మితమవుతోంది. 
కిస్ టీజర్ గబ్బు లేపుతోంది

ఈ చిత్ర టీజర్‌ను గురువారం విడుదల చేశారు. టైటిల్‌కి తగ్గట్టుగానే టీజర్ మొత్తం కిస్సులే. కిస్సింగ్ సీన్లను కెమెరామేన్ లక్ష్మణ్ అద్భుతంగా చిత్రీకరించారు. ఇలాంటి సినిమాలు కోరుకునేవారికి పూర్తి సంతృప్తిని కలిగించేలా కెమెరా వర్క్ ఉంది. ఇక హీరోహీరోయిన్ల గురించి ఎంత చెప్పినా తక్కువే. అద్భుతంగా చేశారు. అద్భుతంగా అంటే నటన అనుకునేరు.. కిస్సింగ్‌లు.కాగా, ఈ సినిమా గురించి ఇటీవల చిత్ర దర్శకనిర్మాత శివ మాట్లాడుతూ.. ‘‘దెయ్యం వయాగ్రా మింగితే అనే విభిన్నమైన కాన్సెప్ట్‌తో రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం రూపొందుతోంది. ఇంతవరకూ ఈ కాన్సెప్ట్‌తో ఏ భాషలో సినిమా రాలేదు. నూతన నటీనటులతో రూపొందిన ఈ చిత్రం విజయంపై కాన్ఫిడెంట్‌గా ఉన్నాం. ప్రస్తుతం షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తాం’’ అని అన్నారు. ఈ చిత్రానికి నవనీత్ చారి సంగీతం సమకూరుస్తున్నారు.