హైద్రాబాద్, జనవరి 25, (way2newstv.com)
మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అద్భుత విజయం సాధించిందని నిజామాబాద్ మాజీ ఎంపీ కవిత ట్వీట్ చేశారు. తెలంగాణ ప్రజలకు తమ పార్టీకి అపూర్వ విజయాన్ని అందించారని ట్విటర్ ద్వారా ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై సోషల్ మీడియా ద్వారా స్పందించిన కవిత… గెలిచిన అభ్యర్థులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. టీఆర్ఎస్ పార్టీకి మద్దతుగా నిలిచిన ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలని చెబుతూ…. జై తెలంగాణ !! జై టీఆర్ఎస్ !! జై కేసీఆర్ !! అని ట్వీట్ చేశారు.
జైటీఆర్ ఎస్ :కవిత ట్వీట్