తాడేపల్లి జనవరి 3, (way2newstv.com)
తనకు నీరుగొండలో ఐదెకరాలున్నట్లు నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) అన్నారు. గురువారం టీడీపీ నేత బోండా ఉమ చేసిన ఆరోపణలకు ఆయన స్పందించారు. రాజధానిలో తనకు భూములున్నట్లు నిరూపిస్తే వాటిని ఇచ్చేస్తానన్నారు. అలాగే స్పీకర్ ఫార్మాట్ లో రాజీనామా, శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానన్నారు. లేదంటే బోండా ఉమ పొరపాటు జరిగిందని ఒప్పుకోవాలన్నారు.తనకు ఒక ఫ్లాట్ మాత్రమే వుందని అయన అన్నారు.
నిరూపించండి...రాజీనామాకు సిద్దం
రాష్ట్ర రాజధానికి చంద్రబాబు నాయుడు శాపమని, జగన్ వరమని మంగళగిరి ఆళ్ల అన్నారు. చంద్రబాబు ఐదేళ్లు ముఖ్యమంత్రిగా ఉండి ఒక్క శాశ్వత భవనం కూడా నిర్మించలేదన్నారు. తప్పులు కప్పి పుచ్చుకోవడానికి బాబు దిగజారుడు రాజకీయం చేస్తున్నారని అయన ఆరోపించారు. రాజధాని పేరిట చంద్రబాబు అక్రమాలకు పాల్పడ్డారన్నారు. చంద్రబాబు అక్రమాలను బయటపెడతామన్నారు.జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై కుడా అళ్ల విరుచుకపడ్డారు. చంద్రబాబుకు కొత్త బినామీ పవన్ కల్యాణ్ అని ఆరోపించారు. అర్ధరాత్రి కరకట్టకు వెళ్లి పవన్ కల్యాణ్ ప్యాకేజీ తెచ్చుకోలేదా అని ప్రశ్నించారు. మంగళగిరిలో జనసేన అభ్యర్థిని ఎందుకు నిలబెట్టలేదని ప్రశ్నించారు.