విజయవాడ జనవరి 2 (way2newstv.com)
ముఖ్యమంత్రి జగన్ రాష్ట్ర సంపదను పట్టించుకోవట్లేదని టీడీపీ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. గురువారం విజయవాడలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సంపద పెరిగితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు. సంపద సృష్టించడానికి టీడీపీ ప్రభుత్వం ఐదేళ్లు కృషి చేసిందని యనమల అన్నారు. అమరావతిలో అక్కడ కనీస మౌలిక సదుపాయాలున్నాయని, సంపద పెరిగితే అభివృద్ధి చెందుతుందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ లో చాలా సమస్యలు ఉన్నాయని చెప్పారు. నిత్యావసర వస్తువుల ధరలు మండిపోతున్నాయని, వీటన్నింటినీ పక్కనపెట్టి వివాదాలు తెరపైకి తెస్తున్నారని యనమల విమర్శించారు.
సంపద పెరిగితేనే అభివృద్ధి
సీఎం జగన్, ఆయన అనుచరుల సంపద పెంచుకోవడంపై ఆలోచిస్తున్నారని విమర్శించారు. ఆర్థిక వృద్ధి పడిపోతే రాష్ట్ర ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోవట్లేదన్నారు. రాష్ట్రంలో చాలా సమస్యలు ఉన్నాయని, ధరలు మండిపోతున్నాయన్నారు. సంపద పెరగకపోతే ఆదాయం ఎక్కణ్నుంచి వస్తుందన్నారు. వీటిని పక్కనపెట్టడానికి వివాదాలు తెరపైకి తెస్తున్నారన్నారు. తరలింపు పేరుతో తెచ్చిన సమస్యలతో కొత్త సంస్థలు వచ్చే పరిస్థితి లేదన్నారు. పక్క రాష్ట్రాలకు ఆదాయం చేకూర్చేలా జగన్ వ్యవహరిస్తున్నారన్నారు. ప్రశాంతమైన విశాఖలో చిచ్చురేపాలని చూస్తున్నారని విమర్శించారు. తమిళనాడు స్థిరంగా అభివృద్ధి చెందుతోందన్నారు. విశాఖలో ఎప్పటినుంచో అభివృద్ధి ఉందన్నారు. ఇప్పటికే కడప, బెంగళూరు, హైదరాబాద్ అన్ని చోట్ల ప్యాలెస్ లు జగన్ కట్టుకున్నారని యనమల అన్నారు. రేపు విశాఖపట్నం వెళ్తే అక్కడ మరో ప్యాలెస్ కడతారా? అని ప్రశ్నించారు.