అమ్మకానికి వజ్ర బస్సులు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

అమ్మకానికి వజ్ర బస్సులు

హైద్రాబాద్, జనవరి 1, (way2newstv.com)
వజ్ర బస్సుల అమ్మకానికి ఆర్టీసీలో రంగం సిద్ధమైంది. భారీగా నష్టాలు రావడంతో వీటిలో సగం బస్సులు వేలం ద్వారా అమ్మేయాలని.. మిగతా సగం మినీ కార్గోకు ఉపయోగించాలని అధికారులు ఆలోచిస్తున్నారు. 2017 మేలో సీఎం కేసీఆర్‌‌‌‌‌‌‌‌ సూచనల మేరకు ఆర్టీసీ అధికారులు వజ్ర బస్సులు ప్రారంభించారు. ఈ బస్సు ఒక్కోటి సుమారు రూ.25 లక్షలకు కొన్నారు. 21 సీట్ల కెపాసిటీ ఉన్న వీటిలో ఏసీ, ఎల్‌‌‌‌‌‌‌‌సీడీ టీవీ విత్‌‌‌‌‌‌‌‌ హైక్లాస్‌‌‌‌‌‌‌‌ ఆడియో సిస్టమ్‌‌‌‌‌‌‌‌, ఎయిర్‌‌‌‌‌‌‌‌ సస్పెన్షన్‌‌‌‌‌‌‌‌ ఫెసిలిటీ, ఇండివిజువల్‌‌‌‌‌‌‌‌ ఏసీ అడ్జస్ట్‌‌‌‌‌‌‌‌మెంట్, డ్రింకింగ్‌‌‌‌‌‌‌‌ వాటర్‌‌‌‌‌‌‌‌ బాటిల్స్‌‌‌‌‌‌‌‌, జీపీఎస్‌‌‌‌‌‌‌‌తో కూడిన ఫిట్టెడ్‌‌‌‌‌‌‌‌ ట్యాబ్‌‌‌‌‌‌‌‌ సౌలత్‌‌‌‌‌‌‌‌లు ఉన్నాయి. 
అమ్మకానికి వజ్ర బస్సులు

ప్రస్తుతం సంస్థలో వంద బస్సులు ఉన్నాయి. ఇవి కాలనీ వద్దకు వచ్చి ప్రయాణికులును ఎక్కించుకునేవి.వజ్ర బస్సులకు కిలోమీటర్‌‌‌‌‌‌‌‌కు రూ.10 కిపైగా నష్టం వస్తోంది. కిలోమీటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు రూ.35 రావాల్సి ఉండగా రెండేళ్లుగా రూ.20 కూడా రావడంలేదు. దీంతో 13 కోట్ల దాకా నష్టం వచ్చినట్లు తెలుస్తోంది. గరుడ బస్ కంటే వజ్ర టికెట్‌‌‌‌‌‌‌‌ ధర ఎక్కువ. లాభం వచ్చే పరిస్థితి లేక కొన్ని రోజులుగా వజ్ర టికెట్‌‌‌‌‌‌‌‌ బుకింగ్స్‌‌‌‌‌‌‌‌ ఆపేశారు.ఇటీవలి ఆర్టీసీ ఉన్నతాధికారుల మీటింగ్‌‌‌‌‌‌‌‌లో వీటిపై చర్చించారు. లాభాల్లోకి తెచ్చే అవకాశం లేదని… అమ్మడమే బెటర్‌‌‌‌‌‌‌‌నే నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. వంద బస్సుల్లో 50 మాత్రమే అమ్మాలనుకుంటునట్లు సమాచారం. వాటిని కూడా వేలం ద్వారా అమ్మనున్నారు. ఒక్కొక్కటి రూ.10 లక్షలకైనా అమ్ముడయ్యే చాన్స్‌‌‌‌‌‌‌‌ ఉంది. దీంతో సంస్థకు రూ.5 కోట్ల దాకా వస్తాయి. అయితే ఈ బస్సులు కొని రెండున్నరేండ్లు మాత్రమే అవుతోంది. సగం ధరకు అమ్మడం కంటే టూరిజం డిపార్ట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌కు ఇస్తే బెటరని రవాణా రంగ నిపుణులు అంటున్నారు. మరో 50 బస్సులను మినీ కార్గోకు ఉపయోగించనున్నట్లు సమాచారం.