టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు
అమరావతి జనవరి 9 (way2newstv.com)
ఏపీ సర్కార్‌పై టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చైతన్య యాత్రను అడ్డుకోవడం సబబు కాదన్నారు. విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన.. అమరావతి రాజధాని కోసం తమ పోరాటం కొనసాగుతుందన్నారు. సెక్యూరిటీ కోసం బస్సు ఆపామని పోలీసులు చెబుతున్నారని.. అవన్నీ కుంటిసాకులని మండిపడ్డారు. తాను సీఎంగా ఉన్నప్పుడు తండ్రీకొడుకులు పాదయాత్రలు చేశారని.. తాను కూడా అడ్డుకొని ఉంటే వాళ్లు పాదయాత్ర చేసేవాళ్లా అని ప్రశ్నించారు.
తాను కూడా అడ్డుకొని ఉంటే తండ్రీకొడుకులు పాదయాత్ర చేసేవాళ్లా
11 మంది రైతులు గుండెపోటుతో చనిపోయారని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. రాజధానికి లక్ష కోట్లు కావాలని అంటున్నారని.. ఇప్పటికే అసెంబ్లీ, హైకోర్టు, సచివాలయం అన్నీ సిద్ధంగా ఉన్నాయి.. ఇంకా ఏం కావాలన్నారు. అణచివేయాలని చూస్తే ఉధృతం అవుతుందే తప్ప తగ్గే సమస్య ఉండదన్నారు. ఇన్‌సైడ్ ట్రేడింగ్ జరిగి ఉంటే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించండని డిమాండ్ చేశారు. తప్పు చేసిన వారిని శిక్షించండి.. తాము కూడా సహకరిస్తామన్నారు. ఆందోళనలు కొనసాగుతాయని.. ప్రజలెవరూ భయపడవద్దన్నారు. అమరావతి ఇక్కడే ఉంటుందని.. ప్రభుత్వం ప్రకటన చేసే వరకు జేఏసీ పని చేయాలని చంద్రబాబు సూచించారు.