నమ్మకంగా పని చేస్తాం
టిడిపి పొలిట్ బ్యూరో సభ్యుడు రావుల
వనపర్తి జనవరి 09 (way2newstv.com)
మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు నమ్మి టిడిపికి ఓటు వేయాలని నమ్మకం గా పనిచేస్తామని టిడిపి జాతీయ పొలిట్ బ్యూరో సభ్యుడు మాజీ ఎంపి రావుల చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. గురువారం వనపర్తి లోని ఆయన స్వగృహంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు ఎమ్మెల్యేగా, ప్రభుత్వ విప్ గా ఎంపీ గా వనపర్తి జిల్లా ఏర్పాటుకు అవసరమైన భవనాలు రోడ్లు తాగునీరు సాగునీరు అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలను తన హయాంలోనే చేపట్టడం జరిగిందని తెలిపారు. అప్పుడు నిర్మించిన పలు నిర్మాణాలకు రంగులు వేసి ప్రారంభోత్సవాలు చేసి పూలు చల్లి ఫోటోలు దిగుతున్నారని ఆరోపించారు వనపర్తి రోడ్డు విస్తరణ లో ఆస్తులు కోల్పోయే వారికి 20 కోట్ల రూపాయలను మంజూరు చేయించాలని, వాటినే 20 కోట్లు వస్తున్నాయని టిఆర్ఎస్ ఎస్ నేతలు పాలాభిషేకాలు చేశారని కానీ తేలేదని గుర్తు చేశారు.
నమ్మి ఓటేయండి
ఫ్లెక్సీ ల కు పాలు పోసే సంస్కృతికి వ్యక్తిగతంగా వ్యతిరేకమని తెలిపారు. కేటీఆర్ వనపర్తి వచ్చినప్పుడు రోడ్ల విస్తరణకు 50 కోట్లు ఇస్తామని హామీ ఇచ్చారని ఎక్కడున్నాయి అని ప్రశ్నించారు. రామన్ పాడు నుంచి మంచినీటి పథకం పెద్దమందడి లో 400 కెవి సబ్ స్టేషన్ వనపర్తి లో 220 కెవి సబ్ స్టేషన్ రెండు 132 కెవి సబ్ స్టేషన్ లు తెచ్చామని తెలిపారు. వంద పడకల ఆసుపత్రి వనపర్తి లో మినీ స్టేడియం నియోజకవర్గంలో డబుల్ రోడ్ల విస్తరణ తెలుగుదేశం హయాంలో జరిగాయని అన్నారు. డిగ్రీ కాలేజీలు, జూనియర్ కళాశాలలు, పాఠశాలలకు అదనపు గదులు, మోడల్ స్కూల్ లు, కస్తూరిబా స్కూల్ లు, ఉర్దూ మీడియం స్కూల్, కళాశాలలు తెచ్చామని తెలిపారు కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ భీమా ప్రాజెక్టు తెలుగుదేశం కాంగ్రెస్ హయాంలో ప్రారంభమైన వేనని తెలిపారు గత రెవెన్యూ డివిజన్ పరిధి కి ఒక ఆత్మకూరు మండలం కలిపి ఇప్పుడు జిల్లా చేశారని అన్నారు. జిల్లాకు అవసరమైన అన్ని భవనాలను అప్పట్లోనే నిర్మించామని వాటిల్లోనే ఇప్పుడు కార్యాలయాలు నడుస్తున్నాయని కొత్తగా వచ్చింది ఏమీ లేదని తెలిపారు ఈ విషయాలన్నింటిని ఎన్నికల్లో ప్రజలకు కు వివరిస్తామని అన్నారు. ఆరేళ్లుగా టిఆర్ఎస్ ఫిరాయింపుల అజెండాతో ముందుకు వెళుతున్నదని విమర్శించారు పేదలకు పింఛన్లు పక్క ఇండ్లు 50 రూపాయలకే వ్యవసాయానికి కరెంటు రెండు రూపాయల కిలో బియ్యం తెలుగుదేశం హయాంలో వచ్చాయని తెలిపారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు నిర్మిస్తామని రోడ్ల విస్తరణ అన్నారని ఎక్కడ నిర్మించారని ప్రశ్నించారు. నీళ్లు నిధులు ఉద్యోగాలు టిఆర్ఎస్ నినాదమని నీళ్లు గత ప్రభుత్వ హయాంలోనే వచ్చాయి నిధులు లేవు ఉద్యోగాల జాడే లేదని విమర్శించారు ఎన్నికల్లో రాశీ తో కాక వాసి ప్రధానంగా ప్రజల కోసం పని చేసే అభ్యర్థులను టిడిపి తరఫున ఎన్నికల్లో నిలుపుతామని అన్నారు. గతంలో టిడిపి తరఫున గెలిచిన చాలామంది పార్టీ ఫిరాయింపు చారని తెలుగుదేశం తరఫున శారద కౌన్సిలర్గా చివరి వరకు మున్సిపాలిటీలో ప్రజల గొంతు వినిపించిందని గుర్తు చేసారు. ఎన్నికల ప్రచారంలో వ్యక్తిగత దూషణలకు పోమని తెలిపారు వనపర్తి ప్రజలు విజ్ఞులు చైతన్యవంతులు వాస్తవాలను గ్రహించి మున్సిపల్ ఎన్నికల్లో సరైన తీర్పు ఇస్తారని ఇవ్వాలని కోరారు. విలేకర్ల సమావేశంలో నాగర్ కర్నూల్ పార్లమెంట్ ఇంచార్జ్ బి రాములు, టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి అచ్యుత రామారావు, వనపర్తి మండలం మాజీ జడ్పిటిసి సభ్యులు వెంకటయ్య యాదవ్, టిడిపి పట్టణ అధ్యక్షులు నందిమల్ల అశోక్, మాజీ కౌన్సిలర్ శారద, తెలుగు యువత ఉమ్మడి జిల్లా కార్యదర్శి నందిమల్ల రమేష్, వనపర్తి పట్టణ అధ్యక్షులు కాగితాల లక్ష్మయ్య, మైనార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి దస్తగిరి, మైనార్టీ నాయకులు వహీద్, గోపాల్, బాల రామ్ తదితరులు పాల్గొన్నారు