తెలంగాణలో వంద శాతం అక్షరాస్యత లక్ష్యం : సబితా

హైదరాబాద్‌ జనవరి 6  (way2newstv.com)
తెలంగాణ రాష్ర్టాన్ని వంద శాతం అక్షరాస్యత గల రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. రాష్ట్రంలో చదువురాని వ్యక్తి ఉండకూడదన్నదే సీఎం కేసీఆర్‌ ధ్యేయమని మంత్రి పేర్కొన్నారు. అందుకనుగుణంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈచ్‌ వన్‌.. టీచ్‌ వన్‌ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నారని మంత్రి తెలిపారు. 
తెలంగాణలో వంద శాతం అక్షరాస్యత లక్ష్యం : సబితా

సీఎం కేసీఆర్‌ ఆదేశాలతో విద్యారంగంలో నూతన మార్పులు వచ్చాయని మంత్రి గుర్తు చేశారు. ప్రభుత్వం ఉన్నత విద్యను మరింత పటిష్టం చేసిందని మంత్రి ఈ సందర్భంగా అన్నారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించే ఏఐ లాంటి కొత్త కోర్సులు ప్రారంభించనున్నట్లు మంత్రి సబితా రెడ్డి తెలిపారు.
Previous Post Next Post