వేములవాడ జనవరి 27 (way2newstv.com)
వేములవాడ మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నికలలో చైర్మన్ గా రామతీర్థపు మాధవి వైస్ చైర్మన్ గా మధు రాజేందర్ ఎన్నికయ్యారు.ఈ ఉదయం కాంప్ నుండి నేరుగా మున్సిపల్ సమావేశమందిరానికి చేరుకున్న తెరాస సభ్యులు ,వెనుకాలే చేరుకున్న బీజేపీ సభ్యులు ఇండిపెండెట్ కౌన్సిలర్లకు మున్సిపల్ కమిషనర్ స్వాగతం పలికారు. వీరి రాక కోసం కార్యాలయాన్ని ముస్తాబు చేశారు. గెలిచిన 27 మంది సభ్యులతో పాటు ఎమ్మెల్యే రమేష్ బాబు సమావేశానికి హాజరయ్యారు. మొదట సభ్యులతో ప్రమాణం చేయించిన కమిషనర్ తరువాత వైస్ చైర్మన్ ఎన్నికను నిర్వహించారు. అధిష్టానం నుండి వచ్చిన సీల్డ్ కవర్ ను ఎమ్మెల్యే సభ్యులకు అందించగా అందులో ఉన్న 23 వార్డ్ అభ్యర్థి మధు రాజేంద్ర శర్మను ఏకగ్రీవం గా ఎన్నుకున్నారు.
వేములవాడ మున్సిపల్ చైర్మన్ గా రామతీర్థపు మాధవి
వేములవాడ లో బ్రాహ్మణ వర్గాన్నికి ప్రాతినిధ్యం కల్పించడంతో పాటు ఈ వార్డులో బీజేపీ జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణను వోడించినందుకు ఆయనకు ఈ పదవి ఇచ్చినట్లు తెలుస్తుంది. అనంతరం చైర్మన్ గా రామతీర్థపు మాధవి పేరును సీల్డ్ కవర్ నుండి తెరిచి ప్రతిపాదించగా సభ్యులు బలపరిచారు. చైర్మన్ గా ఎన్నికైన రామతీర్థపు మాధవి వేములవాడ సెస్ డైరెక్టర్ రామతీర్థపు రాజు భార్య. పట్టణం లో ప్రజాదరణ కలిగిన నేత గా రాజుకు గుర్తింపు ఉంది. నిత్యం ప్రజాసమస్యల సాధనకు ఆయన ప్రజలతో మమేక మవుతుంటారు. కాగా సామజిక పరంగా అత్యధిక జనాభా ఉన్న మున్నూరు కాపు వర్గానికి చెందిన మాధవి కౌన్సెలర్ గా రెండో సారి విజయం సాధించారు. అనుభవం, ప్రజాదరణ దృష్ట్యా వారికి ఈ పదవి దక్కినట్లు, ఒత్తిడి ఉన్నా వీరివైపే ఎమ్మెల్యే మొగ్గు చూపినట్లు సమాచారం. దీనితో వీరిరువురు ఎన్నికయినట్లు కమిషనర్ ప్రవీణ్ ప్రకటించారు. ఎక్స్ ఆఫీసియో సభ్యుడుగా హాజరైన ఎమ్మెల్యే రమేష్ బాబు వీరిని అభినందించారు. కాగా ఎన్నికల్లో అంతకు ముందు పార్టీ కోసం తీవ్రం గా శ్రమ పడ్డ యాచమనేని శ్రీనివాస రావుకు నిరాశే ఎదురయ్యింది. వైస్ చైర్మన్ గా ఆయనను ఎమ్మెల్యే ఎంపిక చేస్తారనుకున్నప్ప్టటికి సమీకరణాల నేపథ్యం లో ఆయనకు ఏ పదవి దక్కలేదు. కాగా ఆరుగురు సభ్యులు ఎన్నికైన కొండా కుటుంబానికి ఎమ్మెల్యే రమేష్ బాబు చైర్మన్ గాఎందుకు అవకాశమివ్వలేదో అర్థం కావడం లేదని ప్రజలు గుసగుస లాడుతున్నారు.