ఎరక్క పోయి... ఇరుక్కుపోయారే - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ఎరక్క పోయి... ఇరుక్కుపోయారే

రాజమండ్రి, జనవరి 1, (way2newstv.com)
ఎపి రాజధాని గా అమరావతి ని ప్రకటించకముందు, ప్రకటించాక పెద్దఎత్తున భూముల కొనుగోళ్ళు అమ్మకాలు పెరిగాయి. బడా బాబులు, రియల్ ఎస్టేట్ కింగ్ లతో పోటీలు పడి నేతలు రాజధాని లో భూములు కొనేందుకు దూకేశారు. దీనికోసం తమ తమ ప్రాంతాల్లో సైతం ఆస్తులు అమ్ముకుని, అప్పులు చేసి కొందరు అమరావతిలో పాగా వేసేందుకు భవిష్యత్తు పై ఆశతో పెట్టుబడులు పెట్టేశారు. ఇప్పుడు జగన్ మూడు రాజధానుల ప్రకటన అనంతరం అమరావతిని నమ్ముకున్నవారంతా బేల చూపులు చూస్తున్నారు. దీనికి తోడు రాజకీయ నేతలుగా ఉండి అమరావతిలో భూములు కొన్న టిడిపి వారికి మరింత ఇబ్బందులు క్యాబినెట్ సబ్ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ తో వచ్చి పడింది.అమరావతిలో నాయకుల భూముల వివరాలు వెల్లడి కావడంతో ఇప్పుడు ఆ లిస్ట్ లో వున్నవారు తమ సచ్చీలత నిరూపించుకోవాలిసి వస్తుంది. 
ఎరక్క పోయి... ఇరుక్కుపోయారే

కమిటీ పేర్లు చదివేసింది. ప్రభుత్వం దీనిపై విచారణకు సిద్ధం అవుతుంది. ఈ నేపథ్యంలో కోట్ల రూపాయలు ఖర్చు చేసి భూములు కొంటే డబ్బు పోయి, పరువు పోతుండటం పట్ల తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఒక్కరొక్కరుగా బయటకు వచ్చి తాము భూములు కొన్నది నిజమే అని అయితే అది ఎప్పుడు ఎలా ఏ డబ్బుతో కొన్నది మీడియా ముందు చెప్పుకోవడం గమనార్హం. ఈ కోవలోకి రాజమండ్రి రూరల్ ఎమ్యెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ముందుగా రంగంలోకి దిగి వైసిపి సర్కార్ పై నిప్పులే చెరిగారు. తాను వ్యాపారాల ద్వారా రూపాయి రూపాయి కూడబెట్టిన డబ్బు 89 ప్లాట్ లు అమ్మగా వచ్చిన డబ్బుతో అమరావతి రాజధాని ప్రకటన తరువాతే భూములు కొన్నానని అది ఇన్ సైడ్ ట్రేడింగ్ అయితే జగన్ తాడేపల్లి లో భూమి కొని కట్టిన ఇల్లు ఇన్ సైడ్ ట్రేడింగ్ కే వస్తుందంటూ నిప్పులు చెరిగారు. అలాగే వేమూరి రవికుమార్ బయటకు వచ్చారు. ఆయన తాను 2004 లో ఆరు ఎకరాలు కొనుగోలు చేస్తే లోకేష్ బినామీ గా పేర్కొనడం దారుణం అంటూ వాపోయారు.రాజధానిలో భూములు కొనుగోలు చేసిన వారిలో మురళి మోహన్, పయ్యావుల కేశవ్ వంటివారు వివరణ ఇవ్వలిసి వుంది. క్యాబినెట్ సబ్ కమిటీ లో వచ్చిన పేర్లలో ఒక్కటి మాత్రం తేటతెల్లం అయ్యింది. దీనిప్రకారం వైసిపి ఆరోపిస్తున్న ఒకే సామాజిక వర్గం వారు అమరావతి కేంద్రంగా భూములు కొన్నదన్నది నివేదిక స్పష్టం చేస్తుంది. రాజధాని ప్రకటనకు ముందు తరువాత ఆ సామాజిక వర్గం వారే ఈ వ్యవహారంలో పెద్ద ఎత్తున వున్నారని ఎన్నికల ముందు తరువాత కూడా వైసిపి గట్టిగా ప్రచారం చేసేది. ఇప్పుడు అదే నిజమని ప్రజలకు వైసిపి వివరించి చెప్పడానికి సబ్ కమిటీ నివేదిక బాగా ఉపయోగపడనుంది. అయితే చట్టపరంగా, న్యాయపరంగా భూములు కొనడం ఎలా తప్పన్నది వీరి వాదన. అయితే రాజధాని మార్పు అంశం తెరపైకి వచ్చాక భూముల ధరలు నేలచూపులు చూస్తున్నాయి. రోజులు గడిచే కొద్ది ఇవి కొనేవారు కూడా కనపడరన్న ప్రచారం రియల్ వర్గాలనుంచి వినవస్తుంది. ఈ నేపథ్యంలో డబ్బు పోయే శని పట్టే అన్నతీరులో తమపరిస్థితి మారిపోయిందని అమరావతిపై ఆశపడి ఉన్నదంతా ధారపోసిన వారు వాపోతున్నారు.