ఫిర్యాదుదారుల ఫీడ్ బ్యాక్ డే - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ఫిర్యాదుదారుల ఫీడ్ బ్యాక్ డే

నిర్మల్, జనవరి 8  (way2newstv.com)
నిర్మల్ జిల్లా వ్యాప్తంగా మంగళవారం ఫిర్యాదుదారుల ఫీడ్ బ్యాక్ డేను నిర్వహించారు.  వివిధ పోలీసు స్టేషన్లలో కేసుల పురోగతిని ఫిర్యాదుదారులకు వివరించారు.  వివిధ పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులు, దర్యాప్తు ఏ దిశలో ఉందనే విషయాన్ని పోలీస్ అధికారులు ఫిర్యాదుదారులకు టెలిఫోన్ ల ద్వారా తెలియజేశారు. కేసుల పురోగతిని ఫిర్యాదుదారులకు వివరించడం ద్వారా అపోహలు తొలగిపోయే అవకాశం ఉంది. కేసుల పురోగతిని వివరించడం ద్వారా ఫిర్యాదుదారులకు కేసు ఏ దిశలో ఉంది, పోలీసులు ఏలాంటి చర్యలు తీసుకుంటున్నారనే విషయాపై అవగాహన ఏర్పడుతున్నది. 
ఫిర్యాదుదారుల ఫీడ్ బ్యాక్ డే

జిల్లా వ్యాప్తంగా శనివారం నిర్వహించిన ఫిర్యాదుదారుల ఫీడ్ బ్యాక్ డే సందర్భంగా జనవరి 01, 2020 నుండి జనవరి 07, 2020 వరకు వచ్చిన 70 ఫిర్యాదులోని ఫిర్యాదుదారులకు మరియు గత సంవత్సరం పెండింగ్ లో ఉన్న అండర్ ఇన్వెస్టిగేషన్  కేసులలోని ఫిర్యాదుదారులకు కేసులు పురోగతిని తెలియజేసారు.  గతంలో ఫిర్యాదుదారులకు తమ కేసు ఏదిశలో ఉందో తెలుసుకునే అవకాశం ఉండేది కాదు. ఈ కార్యక్రమంలో ద్వారా పోలీసుల పనితీరు, కేసుల దశలను పోలీసు అధికారులే టెలిఫోన్ లు చేసి తెలియజేస్తుండటం వల్ల ఫిర్యాదుదారులు ఆనందం వెల్లివిరుస్తోంది. ప్రతి శనివారం ఈ ఫీడ్ బ్యాక్ డేను నిర్వహించడం జరుగుతుందని ఈ సంవత్సరం నుండి ఇది అమలులో ఉంటుందని జిల్లా ఎస్పీ సి.శశిధర్ రాజు  గారు ఒక ప్రకటనలో తెలిపారు.