వారాసి గూడాలో దారుణం, లొంగిపోయిన నిందితుడు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

వారాసి గూడాలో దారుణం, లొంగిపోయిన నిందితుడు

హైద్రాబాద్, జనవరి 24, (way2newstv.com)
చిలకలగూడ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని వారాసిగూడలో దారుణం చోటు చేసుకుంది. ఇర్ఫానా అనే బాలికను గుర్తు తెలియని దుండగులు హత్య చేశారు. బాలిక నివాసం ఉంటున్న భవనంపై రక్తపు మరకలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఘటనాస్థలికి చేరుకున్న క్లూస్‌ టీం ఆధారాలు సేకరిస్తోంది.  కాగా బాలికపై దుండగులు అత్యాచారం చేసి, అనంతరం హత్య చేసినట్లు అనుమానిస్తున్నారు. ఇద్దరు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్ని ప్రశ్నించారు. రెండు అపార్ట్‌మెంట్ల మధ్య పడిఉన్న బాలిక మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించి,పోస్ట్‌మార్టం చేయిస్తున్నారు. సంఘటనా స్థలంలో సీసీ టీవీ ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నారు.  కాగా బాలిక నిన్న సాయంత్రం ఇంటి నుంచి అదృశ్యమైనట్లు తెలుస్తోంది. కాగా ఈ సంఘటనతో వారాసిగూడ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. 
వారాసి గూడాలో దారుణం, లొంగిపోయిన నిందితుడు

మృతురాలి ఇంటి వద్దకు స్థానికులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. మరోవైపు మృతురాలి బంధువులు..బాలికపై అత్యాచారం చేసి, హత్య చేసి ఉంటారని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. గతంలో ప్రేమ పేరుతో బాలికను ఓ యువకుడు వేధించేవాడని బంధువులు చెబుతున్నారు. పోలీసులు అన్ని కోణాల్లో విచారణ జరిపి, నిందితులను కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు. ఇక ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు వారాసిగూడలో భారీగా మోహరించారు.పెళ్లి కాదన్నందుకు కొట్టి చంపాడుఇంటర్ విద్యార్థిని హత్య కేసులో నిజాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఆమె మృతదేహంపై 11 చోట్ల గాయాలను పోలీసులు గుర్తించారు. ప్రైమరీ పోస్టుమార్టం నివేదికలో కూడా దీనిని వైద్యులు వెల్లడించారు. ఈ హత్య కేసు నిందితుడు షోయబ్ చిలకలగూడ పోలీసుల ఎదుట లొంగిపోయాడు. గతంలో విద్యార్థినిని పెళ్లి చేసుకుంటానని ఆమె తల్లిదండ్రులను షోయబ్‌ అడిగాడు. దీనికి విద్యార్థిని తల్లిదండ్రులు నిరాకరించారు. అప్పటి నుంచి విద్యార్థినిపై షోయబ్ కోపం పెంచుకున్నాడు. ఆమెను కొట్టి చంపి భవనంపై నుంచి తోసేశాడు.