మ‌త‌మార్పుడుల‌ను నిషేధించేందుకు త్వరలో కొత్త చట్టం?

న్యూ డిల్లీ ఆగష్టు 10  (way2newstv.com)
రెండోసారి అధికారంలోకి వచ్చిన 100 రోజులలోనే ట్రిపుల్ తలాక్, ఆర్టిక‌ల్ 370 ర‌ద్దు లాంటి సంచలనాలను సృష్టించిన భాజపా ప్రభుత్వం, మరో కీలక బిల్లుకు సిద్దమైనట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. దేశంలోని పేదవారే లక్ష్యంగా మత మార్పిడిలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ మ‌త‌మార్పుడుల‌ను నిషేధించేందుకు మోదీ స‌ర్కార్ కొత్త చ‌ట్టాన్ని తీసుకురావాల‌నుకుంటున్న‌ది. 
మ‌త‌మార్పుడుల‌ను నిషేధించేందుకు త్వరలో కొత్త చట్టం?
దీని కోసం వ‌చ్చే పార్ల‌మెంట్ స‌మావేశాల్లో బిల్లును ప్ర‌వేశ‌పెట్టే సూచ‌న‌లు క‌నిపిస్తున్నాయి. మ‌త‌మార్పుడ‌ల వ్య‌తిరేక బిల్లుకు కావాల్సిన అన్ని అంశాల‌ను ప్ర‌భుత్వం ప‌రిశీలిస్తున్న‌ది. ఈ బిల్లు కూడా పార్లమెంట్ లో పాస్ అయితే మోడీ సర్కార్ మరో సంచలనం సృష్టించినట్లే. కాగా గత పార్లమెంట్ లో రాజ్యసభలో సరైన బలం లేనందున మౌనంగా ఉన్న మోడీ ప్రభుత్వం..ఇప్పుడు బలం పెరగడంతో పలు కీలక బిల్లులపై దృష్టి సారించింది.
Previous Post Next Post