ఉద్యోగ భద్రత కల్పించెంత వరకు కలసి పోరాడుదాం: నాగమణి
కౌతలం సెప్టెంబర్ 13 (way2newstv.com)
గోపాల మిత్రులు సర్వ సభ్య సమావేశం కర్నూల్ లో శుక్రవారం నెహ్రూ అధ్యక్షతన సి ఐ టీ యు అధ్వర్యంలో జరిగింది. గోపాల మిత్రులు కమిటీ సభ్యులు మాట్లాడుతూ మనం కలిసి పోరాడుతూనే మనకు ఉద్యోగ భద్రత కల్పించెంత వరకు పోరాడాలని కమిటి సభ్యులకు సహకరించాలని,ఉద్యమాన్ని ముందుకు నడిపించాలని పిలుపునిచ్చారు. ఉద్యమం కర్నూల్ జిల్లా నుంచి గోపాల మిత్రులు రావడం,మొదలుపెట్టడం ఎంతో హర్షించదగ్గ విషయమన్నారు. మనం ధర్నా కార్యక్రమలు రాస్తా రోకో లో శాంతీ యుత ధర్నాలు ర్యాలీలు నిర్వహించము.
గోపాల మిత్రులు సర్వ సభ్య సమావేశం
1 వ తారీఖు నా రాష్ట్ర పశు సంవర్దకా శాఖ మంత్రి మోపదేవి వెంకట రమణ హామీ ఇవ్వడంతో ధర్నా విరమించాము. అవుతుంది అని మురీసి పోకూడదు ఇంకా పోరాడి మన ఉద్యోగ భద్రత కల్పించి సచివాలయం అవకాశం కల్పించి నప్పుడే మనకు నిజమైన ఉద్యమం అని తెలిపారు. మనకు ఉద్యమానికి సీఐటీయూ నాయకులు మద్దతు కల్పించి మనకు ఇంత వరకు నడిపించిన నాయకులకు మన గోపాల మిత్రులు తరుపున హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలిపారు. సీఐటీయూ నాయకులు మాట్లాడుతూ ఉద్యమం అంటే అందరు కలిసి ఉంటేనే భవిష్యత్తులో ఇలాగే పోరాడాలి అని మీకు ఉద్యోగ భద్రత కల్పించి సచివాలయం లోఅవకాశం కల్పించెంత వరకు మి ముందు ఉండీ నడిపిస్తమని మీకు చివరి వరకు మద్దతు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు గౌస్ గోపాల మిత్రుల కమిటీ సభ్యులు నెహ్రూ,నాగమణి, కృష్ణ మూర్తి,వెంకటేష్ శివ,రంగన్న తదితర నాయకులు మరియు గోపాల మిత్రులు పాల్గొన్నారు.
Tags:
News