శ్రీ అన్నపూర్ణాదేవిగా దుర్గమ్మ సాక్షాత్కారం

విజయవాడ  అక్టోబర్ 02  (way2newstv.com)
శరన్నవరాత్రుల్లో నాల్గవ రోజైన బుధవారం ఇంద్రకీలాద్రిపై కొలువైన జగన్మాత కనకదుర్గమ్మ అన్నపూర్ణాదేవిగా భక్తులకు దర్శనం ఇచ్చారు.శరన్నవరాత్రి మహోత్సవములలో శ్రీశ్రీ శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి వార్ల అమ్మవారిని శ్రీ అన్నపూర్ణాదేవిగా అలంకరిస్తారు . అన్నపూరాదేవి సకలజీవరాశులకు ఆహారాన్ని అందించే దేవత.అన్నం పరబ్రహ్మస్వరూపం , అన్నం సర్వజీవనాధారం , అలాంటి అన్నాన్ని ప్రసాదించేది అన్నపూర్ణాదేవి . 
శ్రీ అన్నపూర్ణాదేవిగా దుర్గమ్మ సాక్షాత్కారం

ఈ తల్లి ఎడమ చేతిలో బంగారు పాత్రలో ఉన్న అమృతాన్నమును, వజ్రాలు పొదిగిన గరిటతో తన భర్త అయిన ఈశ్వరునికి బిక్షం వేసిన మహాతలి అన్నపూరాదేవి సకల చరాచర జీవరాశులకి ఆహారాన్నందించే మహాతల్లి లోకంలో ఆకలిని తీర్చటంకన్నా మిన్న ఏది లేదు . అందుకే అన్ని దానాలకన్న అన్నదానం గొప్పదంటారు. అందుకే అన్ని దానాలకన్నా మిన్న అన్నదానం. ఒక్కసారైనా నిత్యాన్నదానేశ్వరి అలంకారంలో దుర్గమ్మను చూసి తరించవలసిందేనని భక్తులు విశ్వాసం.
Previous Post Next Post