భూపాలపల్లి నవంబర్ 30 (way2newstv.com)
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని అంబెడ్కర్ సెంటర్ వద్ద ఇంటర్,డిగ్రీ విద్యార్థినులు, ఏబీవీపీ ఆధ్వర్యంలో రాష్ట్రంలో మూడురోజులుగా మహిళలపై జరుగుతున్న ప్రియాంకరెడ్డి, వరంగల్ లో మనసా, శంషాబాద్ లో మహిళ సజీవదహనం అత్యాచారం, హత్యలను నిరాసిస్తు నిందితులకు వెంటనే బాహిరంగంగా ఉరిశిక్ష వేయాలని, అలాగే బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తు మానవహారాన్ని నిర్వహించారు.
నిందితులకు బహిరంగ ఉరిశిక్ష వేయాలి
ఈ వరుస హత్య సంఘటనలు తెలంగాణ సామాన్య ప్రజలను కలిచి వేస్తుందని, అర్ధ రాత్రి మహిళలు తిరుగితేనే అసలైన స్వసంత్రం వస్తుందని గాంధీ చెప్పారు. కానీ ఇప్పడు ఉదయం,మధ్యాహ్నం మహిళలు బయటకు రావడానికి భయపడుతున్నారు. ఇప్పటికీ ఐనా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి మహిళకు రక్షణ కల్పించాలని కోరుతూ,అలాగే నింధితులను బహిరంగంగా ఉరిశిక్ష అమలు చేయాలని డిమాండ్ చేశారు.
Tags:
telangananews