పదిహేను బృందాలతో గాలింపు చర్యలు చేప్పట్టిన పోలీస్ బృందాలు

షాద్ నగర్ నవంబర్ 28  (way2newstv.com)
రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలోని చటాన్ పల్లి  శివారులో జరిగిన గుర్తు తెలియని యువతి  హత్య కేసులో షాద్ నగర్ పోలీసులు అన్ని కోణాల్లో ప్రారంబించారు.   చటాన్ పల్లి వద్ద ఓ వంతెన పక్కన దారుణంగా హత్య కు గురయింది చే డాక్టర్ ప్రియాంక రెడ్డిగా పోలీసులు నిర్ధారించారు. ఘటనాస్థలానికి శంషాబాద్ డిసిపి  ప్రకాష్ రెడ్డి, షాద్ నగర్ ఏసీపీ సురేందర్, ఇన్స్పెక్టర్ శ్రీధర్ కుమార్ ఘటనా స్థలానికి  చేరుకుని దర్యాప్తు ముమ్మరం చేశారు. ప్రత్యేక టీమ్ లను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. 
పదిహేను  బృందాలతో గాలింపు చర్యలు చేప్పట్టిన పోలీస్ బృందాలు

యువతి పై పెట్రోల్ పోసి తగలబెట్టిన ఘటనలో శంషాబాద్ కు చెందిన యువతిగా గుర్తించారు. అయితే వీరిది సొంత గ్రామం కొల్లాపూర్ నర్సాయపల్లి గ్రామానికి చెందిన వారు అయితే స్థిరపడింది మాత్రం శంషాబాద్ లో. ఇక్కడే  నివాసం ఉంటున్నారు.  మృతి చెందిన యువతి తండ్రితో పాటు కుటుంబ సభ్యులు కూడా ఘటనా స్థలానికి చేరుకున్నారు.  ఎందుకు ఆ యువతిని పెట్రోలు పోసి తగలబెట్టారు అనే కోణంలో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 15 బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. త్వరలోనే ఘాతుకానికి పాల్పడినా దుండగులను పట్టుకుంటామని తెలిపారు.
Previous Post Next Post