దేవి గాయబ్.... దుమ్మురేపుతున్న ధమన్

హైద్రాబాద్,  నవంబర్ 5 (way2newstv.com)
రంగస్థలం తర్వాత దేవిశ్రీ మ్యూజిక్ అంతగా ఎవ్వరికీ ఎక్కడం లేదో… లేదంటే ఈ మధ్యలో ధమన్ హైలెట్ అయ్యాడో గాని.. మొత్తం మీద దేవిశ్రీ మాత్రం కాస్త నెమ్మదించాడు. తాజాగా ధమన్ హవా ఎక్కువగా కనబడడం.. దేవిశ్రీ డల్ అవడం పై సోషల్ మీడియాలో రకరకాల గాసిప్స్ ప్రచారం లోకి వచ్చాయి. తాజాగా ధమన్ అల వైకుంఠపురములో సినిమాతో అదరగొట్టేస్తున్నాడు. అంతేకాకుండా వెంకిమామ, ప్రతి రోజు పండగే సినిమాలకు మ్యూజిక్ డైరెక్టర్ ధమన్ కావడం… 
దేవి గాయబ్.... దుమ్మురేపుతున్న ధమన్

ఆ సినిమాలు కూడా విడుదలకు సిద్దమవడంతో థమన్ పేరు ప్రతిరోజూ మీడియాలో వినబడుతూనే ఉంది.ఇక సరిలేరు నీకెవ్వరూ సినిమాతో దేవిశ్రీ కూడా మంచి ఆల్బమ్ ఇవ్వడానికి ప్రిపేర్ అయ్యాడు. కాకపోతే ఇంకా సరిలేరు సింగిల్స్ మార్కెట్ లోకి రాకపోవడం, అల వైకుంఠపురములో సినిమా పాటలు మర్కెట్ లో హల్చల్ చేస్తున్నాయి. సామజవరాగమనా, రాములో రాముల పాటలు యూత్ ని ఊపెయ్యడం, రెండు పాటలకు అదిరిపోయే వ్యూస్ రావడంతో ధమన్ పేరు బాగా మర్మోగిపోతోంది. మరి సరిలేరు పాటలు కూడా వదిల్తే దేవిశ్రీ సత్తా ఏమిటో తేలిపోతుంది. ఒకవేళ సరిలేరు పాటలు కాస్త డౌన్ అయ్యాయా… ఇక ధమన్ టాప్ పొజిషన్ కి వెళ్లడం ఖాయం.
Previous Post Next Post