మహత్మ జ్యోతిరావు పూలే ఘన నివాళి

నంద్యాల నవంబర్ 28  (way2newstv.com)
నంద్యాల పట్టణంలో గురువారం నాడు స్థానిక పద్మావతి నగర్ లో మహాత్మ జ్యోతిరావు పూలే 129వ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈసందర్భంగా యమ్ యల్ ఏ . శిల్పా రవిచంద్రకిశోర్ రెడ్డి మాట్లాడుతూ.మహాత్మ జ్యోతిరావు పూలే ఆశయసాధనకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని. బీసీల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని. ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి  అనుక్షణం బీసీలను అన్ని విధాల ఆదుకునేందుకు ప్రభుత్వం నిరంతరం పాటుపడుతుందని తెలిపారు. 
మహత్మ జ్యోతిరావు పూలే ఘన నివాళి

నవభారత నిర్మాణానికి, అసమానతలులేని సమాజానికి నాందిపలికిన సామాజిక తొలి విప్లవకారుడు మహాత్మ జ్యోతిరావు ఫూలే అని కొనియాడారు . భారతదేశపు కులాల మూలాల మర్మాన్ని వెలికితీసి ప్రజలను చైతన్యపరిచిన సామాజిక విప్లవకారుడు. ఈ దేశంలో విద్యపై నిషేధాన్ని ఎత్తివేసి, చీకట్లో నుంచి వెలుగులోకి ఈ సమాజం పయనించాలని జీవితాంతం రాజీలేని పోరాటం చేసిన ధన్యజీవి అని అన్నారు .అట్టడుగువర్గాల అభ్యున్నతి కోసం జీవితాన్ని అంకితం చేశారు. మహా త్మ జ్యోతిరావు ఫూలే. అతని భార్య సావిత్రిబాయి పూలే దేశంలో మహిళలకు విద్యను అందించడంలో క్రియాశీల పాత్ర పోషించారని తెలిపారు . వీరు అణగారినవర్గాలకు విద్యను, రైతులకు వ్యవసాయ పద్ధతులను బోధించే వారని తెలిపారు .ఈకార్యక్రమంలో.  జగదీశ్వర రెడ్డి,దేశం సుధాకర్ రెడ్డి,సిద్ధం శివరాం, కైపరాముడు ,కృష్ణమోహన్,బి సి వెంకటేశ్వర్లు,అమృతరాజ్,టైలర్ శివ,సాయిరాం రెడ్డి , పురందర్, సుబ్బారాయుడు,కబీర్, వైస్సార్సీపీ మహిళలు. కార్యకర్తలు తదితరుల పాల్గొన్నారు.
Previous Post Next Post