మహబూబ్ నగర్, ఏప్రిల్ 2, (way2newstv.com):
పనిచేసే ప్రభుత్వాన్ని దీవించండి. గెలిచే అభ్యర్థి మన్నె శ్రీనివాస్ రెడ్డికి ఓటెయ్యండి అని మంత్రి శ్రీనివాస్ గౌడ్ కోరారు. మంగళవారం ఉదయం మహబూబ్ నగర్, బోయపల్లి, మోటార్ లైన్ లలో జరిగిన ఎన్నికల ప్రచారంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎంపీ అభ్యర్థి మన్నె శ్రీనివాస్ రెడ్డి, పార్టీ నేతలు పాల్గొన్నారు. ఎన్నికల ప్రచారానికి పెద్ద ఎత్తున ప్రజలు తరలి వచ్చారు. తాను మాటలు చెప్పి మొఖం చాటేసే నాయకుడి గా రాలేదని చేతలు చేసి చూపెడుతానని, పాలమూరు అభివృద్ధికి పాటుపడుతానని ఎంపీ అభ్యర్థి మన్నె శ్రీనివాస్ రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ ఆశీస్సులతో పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని సాకారం చేసి ప్రతి ఎకరాన్ని పచ్చగా మార్చడమే తన లక్ష్యమన్నారు.
బోయపల్లిలో తెరాస ప్రచారం
పరిశ్రమల ద్వారా ఉపాధి కల్పన ఎలా ఉంటుందో చేసి చూపిన అనుభవంతో మరిన్ని కంపెనీలు పాలమూరుకు తీసుకురావడానికి , నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడానికి నా శాయశక్తులా కృషి చేస్తానని అన్నారు. సీఎం కేసీఆర్ చెప్పినట్లు రైతును రాజు చేసేందుకు, నిరుద్యోగ నిర్మూలన చేసేందుకు కృషి చేస్తానన్నారు. ఇందుకోసం యువత ఉపాధి కల్పనలో భాగంగా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేయిస్తామన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దగ్గర కొట్లాడి పాలమూరు ప్రాజెక్టులు, సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు సాధించుకోవాలంటే రాష్ట్రంలోని 17 నియోజక వర్గాల్లో మన ఎంపీని అత్యధిక మెజారిటీ ఇచ్చి మొదటి స్థానంలో నిలపాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ కోరారు. పని చేసే టి.ఆర్.ఎస్ ప్రభుత్వాన్ని దీవించండి..పాలమూరు ను పాలుగారే పచ్చని పొలాల ఊరుగా మార్చేందుకు, కేంద్రంలో కొట్లాడి నిధులు తెచ్చుకునేందుకు మన ఎంపీ అభ్యర్థి మన్నె శ్రీనివాస్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.