కోల్‌కతాలో భాజపా దాడులను ఖండించిన చంద్రబాబు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

కోల్‌కతాలో భాజపా దాడులను ఖండించిన చంద్రబాబు

అమరావతి మే 15 (way2newstv.com)  
కోల్‌కతాలో భాజపా దాడులను తెదేపా అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు ఖండించారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులు హేయమన్నారు. బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీకి సంఘీభావం తెలుపుతూ అమిత్‌ షా చర్యలను ఖండిస్తున్నట్టు ట్విటర్‌లో పేర్కొన్నారు. 


కోల్‌కతాలో భాజపా దాడులను ఖండించిన చంద్రబాబు

ఇప్పటికే సీబీఐ, ఈడీ, ఐటీ దాడులతో బెంగాల్‌ ప్రభుత్వాన్ని అస్థిరపరిచే ప్రయత్నం చేశారని ఆరోపించారు. ఇప్పుడు అసలు రంగులు చూపిస్తూ భాజపా ప్రత్యక్ష దాడులు చేస్తోందని చంద్రబాబు మండిపడ్డారు. మోదీ, అమిత్‌షా చేస్తోన్న విధ్వంసక వ్యూహాలను ఎదుర్కొనేందుకు దేశంలోని ప్రతిపక్షాలన్నీ ఏకమవ్వాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.