యాదాద్రిలాగే భద్రాద్రి కూడా - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

యాదాద్రిలాగే భద్రాద్రి కూడా

ఎంపీ నామా
భద్రాద్రి కొత్తగూడెం ఆగష్టు 20 (way2newstv.com):
ఖమ్మం పార్లమెంట్ తెరాస  సభ్యులు నామా నాగేశ్వరరావు భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారిలను దర్శించుకున్నారు.ఆలయ ఈవో తాళ్లూరి రమేష్ బాబు ప్రధాన అర్చకులు, సిబ్బంది ఆలయ మర్యాదలతో డప్పు, మేళ వాయిద్యాలతో పూల మాలలు వేసి ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం గర్భగుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు అందించారు. అనంతరం ఆంజనేయ స్వామిని , అలివేలు మంగతాయారులను దర్శించుకున్నారు. విలేకరులతో మాట్లాడుతూ కెసిఆర్ మాటంటే మాటే అభివృద్ధి పదంలో యాదాద్రి పయనిస్తుందని అలాగే భద్రాచలం కూడా 100 కోట్లు ఇస్తానని అని చెప్పిన కేసీఆర్ తప్పకుండా ఇచ్చి అభివృద్ధి పదంలో నడిపిస్తారని అన్నారు. 
యాదాద్రిలాగే భద్రాద్రి కూడా

భద్రాచలం సుందర వందనం గా తీర్చిదిద్ది తెలంగాణ ప్రజలకు భక్తులకు రాముని ఆశీస్సులు  ఉండేవిధంగా అభివృద్ధి  చేసి చూపిస్తారని తెలిపారు. ఈ మధ్యకాలంలో యేదాద్రి పర్యటనలో అనేక విధంగా మార్పులు జరిగాయని అభివృద్ధి చేయుటకు నిధులు మంజూరు చేశారని తెలిపారు. అదేవిధంగా భద్రాచలంను కూడా అభివృద్ధి చేయుటకు ఆయన ఇచ్చిన మాట తప్పరని కెసిఆర్ మాటంటే మాటేనని అన్నారు. అలాగే భద్రాచలంకు రైల్వే లైను ఉంటే బాగుంటుందని, పార్లమెంటు సమావేశాలు విన్నవించామని కేంద్ర ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని నిధులు మంజూరు చేస్తే తప్పకుండా రైల్వే లైను వెప్పిస్తానని తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ నుండైనా రైల్వే ప్రయాణం ద్వారా భద్రాచలం చేరుకునే విధంగా రైల్వే లైను ఉంటే బాగుంటుందని అని ప్రజల ఆకాంక్ష మేరకు ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ద్వారా నిధులు తీసుకు వచ్చే విధంగా ఒత్తిడి తీసుకు వస్తానని తెలిపారు. ఏపీ లో విలీనమైన ఐదు గ్రామపంచాయతీలను భద్రాచలంలో కలిపేందుకు కేసీఆర్ సుముఖంగా ఉన్నారని తెలిపారు.ఆయన వెంట టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పెద్దినేని శ్రీనివాసు, క్రాంతి ఐటిఐ అధినేత చావ లక్ష్మీనారాయణ, తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు ఎస్ కె అజీమ్, భద్రాచలం తెరాస నాయకులు పాల్గొన్నారు.