కాంట్రాక్ట్ ఉద్యోగులకు వైసీపీ మద్దతు : భూమన కరుణాకర్ రెడ్డి - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

కాంట్రాక్ట్ ఉద్యోగులకు వైసీపీ మద్దతు : భూమన కరుణాకర్ రెడ్డి

తిరుపతి, జులై 28, (way2newstv.com)    
టీటీడీలో పదిహేను వేల మంది కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు సేవలు అందిస్తున్నారు. వీరికి పనికి దగ్గ వేతనం ఇవ్వకుండా, వారి శ్రమను దోచుకుంటుంది టీటీడీ. మానవ సేవే మాధవ సేవ అనే నినాదానికి టీటీడీ తూట్లు పోడుస్తుందని వైకాపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు.  తమ న్యాయమైన కోరికలు తీర్చాలి అని నోటీసులు జారీ చేసిన ఉద్యోగుల జేఏసీకి వైసీపీ మద్దతు ఇస్తుంది.  వారి డిమాండ్లు తీర్చాల్సిన బాధ్యత టీటీడీ పై వుంది, అందుకు తగ్గ ఆర్థిక పరిపుష్టి కూడా టీటీడీకి వుంది.  వైసీపీ అధికారంలోకి వస్తే టీటీడీలో పనిచేస్తున్న కార్మికులకు టైం స్కేల్ కల్పిస్తామని అయన అన్నారు.  నేను టీటీడీ చైర్మన్ గా వున్నపుడు పోటు, గోశాల క్రమబద్ధీకరణ చేశాను. వైసీపీ పార్టీకి చిత్తశుద్ధి వుంది ఖచ్చితంగా వారి సమస్యలు పరిష్కరిస్తామని అయన అన్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగులకు వైసీపీ మద్దతు : భూమన కరుణాకర్ రెడ్డి