అవిశ్వాసంతో కేంద్రాన్ని ఎండగట్టాలి : సీఎం చంద్రబాబు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

అవిశ్వాసంతో కేంద్రాన్ని ఎండగట్టాలి : సీఎం చంద్రబాబు

అమరావతి, జూలై 20, (way2newstv.com)
టీడీపీ పోరాటం ఫలితమే కేంద్రంపై అవిశ్వాసమని ఎంపీలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. అవిశ్వాసంతో కేంద్రాన్ని ఎండగట్టాలని సూచించారు. శుక్రవారం ఉదయం ఎంపీలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించిన సీఎం పార్లమెంటులో అనుసరించాల్సిన వ్యూహంపై దిశానిర్దేశం చేశారు. సభలో అవకాశవాద రాజకీయాలను ఎండగట్టాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ పట్ల చూపిస్తున్న వివక్షతను ఎండగట్టాలన్నారు. ఈ సమయంలో బీజేపీకి ఎవరు అనుకూలమో, ఎవరు ప్రతికూలమో తేలిపోతుందన్నారు. మెజార్టీ వర్సెస్ మోరాలిటీ చర్చ దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోందన్నారు.  ఆధిక్యత ముఖ్యమా, నైతికత ముఖ్యమా.. చర్చ ప్రజల్లోకి వెళ్లాలన్నారు. మెజారిటి వర్సెస్ మొరాలిటి చర్చ దేశ వ్యాప్తంగా జరుగుతోందన్నారు. సభ సజావుగా జరిగే అవకాశముందా, గలాటా సృష్టిస్తే ఏం చేయాలి. అనే అంశాలపై చంద్రబాబు ఎంపీలకు సూచన చేశారు.  అందుకు అనుగుణంగా ముందుకు సాగాలన్నారు.  విధిలేని పరిస్థితుల్లో అవిశ్వాసానికి మద్దతు అంటూ వైసీపీ షో చేస్తోందని చంద్రబాబు విమర్శించారు. ఉనికి కోసమే వైసీపీ ఆరాటమని పోరాట స్ఫూర్తి లేదన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా, రైల్వే జోన్ వంటి విభజన హామీలు అమలు చేయని కేంద్రంపై టీడీపీ అవిశ్వాస తీర్మానం పెట్టిన విషయం తెలిసిందే. 

అవిశ్వాసంతో కేంద్రాన్ని ఎండగట్టాలి : సీఎం చంద్రబాబు