మూడు మొక్క‌లు నాటిన మంత్రి ఐకే రెడ్డి మంత్రి ఈటెల రాజేంద‌ర్, మ‌రో ఇద్ద‌రు ఎమ్మెల్యేల‌కు గ్రీన్ చాలెంజ్ కస్తూర్బ గాంధీ బాలికల విద్యాలయంలో మొక్క‌లు నాటిన మంత్రి

నిర్మ‌ల్,జూలై 23 (way2newstv.com)   
మ‌ంత్రి జోగు రామ‌న్న చేసిన గ్రీన్ చాలెంజ్ ను గృహ నిర్మాణ‌, న్యాయ‌, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి  స్వీక‌రించారు. గ్రీన్ చాలెంజ్ లో భాగంగా మామ‌డ మండ‌లం సాంగ్వీ  కస్తూర్బ గాంధీ బాలికల విద్యాలయ ఆవ‌ర‌ణ‌లో మూడు  మొక్క‌లు నాటారు. ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేంద‌ర్, ముధోల్ ఎమ్మెల్యే విఠ‌ల్ రెడ్డి, ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా శ్యాంనాయ‌క్ కు చెరో మూడు మొక్క‌లు నాటాల‌ని  గ్రీన్ చాలెంజ్ విసిరారు. . రాష్ట్రాన్ని హరిత తెలంగాణగా మార్చడానికి సీఎం కేసీఆర్‌ ‘హరితహారం’ చేప‌ట్టార‌ని,  ప్ర‌తి ఒక్క‌రూ సామాజిక భాద్య‌త‌గా మొక్క‌లు నాటాల‌ని మంత్రి పిలుపునిచ్చారు.పెద్దఎత్తున మొక్కలు నాటడం ద్వారా భ‌విష్య‌త్ త‌రాల‌కు  స్వచ్ఛ, ఆహ్లాదకర వాతావరణాన్ని కల్పించడమే లక్ష్యమ‌న్నారు. సస్యశ్యామల తెలంగాణలో ప్ర‌తి ఒక్క‌రు భాగ‌స్వాములు కావాల‌ని సూచించారు.
 
 
 
మూడు మొక్క‌లు నాటిన మంత్రి ఐకే రెడ్డి
మంత్రి ఈటెల రాజేంద‌ర్,  మ‌రో ఇద్ద‌రు ఎమ్మెల్యేల‌కు గ్రీన్ చాలెంజ్ 
కస్తూర్బ గాంధీ బాలికల విద్యాలయంలో మొక్క‌లు నాటిన మంత్రి
 
Previous Post Next Post