నియాల్ తోగులువా 106 భాషల్లో దిట్ట


చెన్నై, మే 22 (way2newstv.com): 
పిట్ట కొంచెం కూత ఘనం.. ఈ సామెత తరచూ మనం వింటూనే ఉంటాం. చెన్నైకి చెందిన ఓ బుడతడి ప్రతిభ గురించి తెలిస్తే.. ఈ పిట్ట సామెత నిజమేనేమో అనిపించడం ఖాయం. ఎందుకంటే.. బాలుడి వయసు ఎనిమిదేళ్లు.. కానీ మనోడు ఏకంగా 106 భాషల్లో అనర్గళంగా మాట్లాడగలడు.. రాయగలడు. ఇప్పుడీ బుడతడు సోషల్ మీడియాతో పాటూ మీడియాలోనూ సెన్సేషన్ అయ్యాడు. 
నియాల్ తోగులువా 106 భాషల్లో దిట్ట

చెన్నైకి చెందిన శంకర్ నారాయణ్ కుమారుడైన నియాల్ తోగులవ.. మొదటి నుంచి భాషలపై మక్కువ ఎక్కువట. గతేడాద నుంచి తమిళంతో పాటూ మిగిలిన భాషలు నేర్చుకోవడం మొదలుపెట్టాడు. ఇంటర్నెట్, యూట్యూబ్ సాయంతో భాష నేర్చుకున్నాడట. అలా నియాల్ ఏకంగా 106 భాషల్లో ప్రావీణ్యం పొందాడట. ఈ బాలుడు ఏకంగా 106 భాషలను నేర్చుకున్నాడు. ఈ భాషల్లో రాయగలడు, చదవలగడు.. 10 భాషల్లో అనర్గళంగా మాట్లాడగలడు. ఈ బుడతడు అక్కడితో ఆగలేదు.. మరో ఐదు భాషల్లోనూ ప్రావీణ్యం సంపాదించే పనిలో బిజీ అయ్యాడట. ఇటు ఇంటర్నెట్‌ ఫోనెటిక్‌ ఆల్ఫాబెట్‌ను కూడా అవపాసన పట్టి మల్టీ టాలెంట్‌గా నిరూపించుకుంటున్నాడు.
Previous Post Next Post