కేసీఆర్ గార‌డి మాట‌లు న‌మ్మే స్థితిలో ప్ర‌జ‌లు లేరు-డాక్ట‌ర్ కె ల‌క్ష్మ‌న్ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

కేసీఆర్ గార‌డి మాట‌లు న‌మ్మే స్థితిలో ప్ర‌జ‌లు లేరు-డాక్ట‌ర్ కె ల‌క్ష్మ‌న్

గోదావరి ఖని, జూలై 4 (way2newstv.com)  
అనంత‌రం బిజెపి రాష్ట్ర అధ్య‌క్షులు డాక్ట‌ర్ ల‌క్ష్మ‌న్ మాట్లాడుతూ...అంద‌రి ఆరాధ్య‌దైవం శ్రీరాముడు తిరిగిన ప్రాంతంగా ఈ ప్రాంతానికి పేరుంద‌ని, ఈ ప్రాంత ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు టీఆర్ఎస్‌కు ప‌ట్‌ డం లేద‌ని, టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు అవినీతి, కుటుంబ‌పాల‌న‌లో దొందూ దొందేన‌ని ఆ పార్టీల‌పై ధ్వ‌జ‌మెత్తారు.
 
 
 
కేసీఆర్ గార‌డి మాట‌లు న‌మ్మే స్థితిలో ప్ర‌జ‌లు లేరు-డాక్ట‌ర్ కె ల‌క్ష్మ‌న్ 
 
11 రోజుల ఈ యాత్ర‌లో ప్ర‌జ‌లు స‌మ‌స్య‌లు వింటుంటే రాస్తే రామాయ‌ణం, చెబితే భార‌తం అవుతుంద‌ని, నాలుగేళ్ల టీఆర్ఎస్ పాల‌న‌లో కేసీఆర్ ఇచ్చిన హామీలు .. హామీలుగానే మిగిలిపోయాయ‌న్నారు. మాట‌ల గార‌డితో పాల‌న చేస్తున్న ఇలాంటి.. ప్ర‌భుత్వాన్ని ఎక్క‌డా చూడ‌లేద‌ని, ముఖ్య‌మంత్రి కేసీఆర్ గార‌డి మాట‌ల‌ను ఇక ప్ర‌జ‌లు న‌మ్మే ప‌రిస్థితి లేద‌ని డాక్ట‌ర్ ల‌క్ష్మ‌న్ విమ‌ర్శించారు. 
నేరేళ్ల‌లో ద‌ళితుల‌ను, ఖ‌మ్మంలో రైతుల‌ను జైల్లో పెట్టించిన ఈ స‌ర్కార్‌కు ప్ర‌జ‌ల బాధ‌లు, క‌ష్టాలు ఏమాత్రం ప‌ట్ట‌కుండా పోయాయ‌ని, దేశానికి వెలుగులు ఇస్తున్న శ్ర‌మ జీవులైన బొగ్గు గనుల కార్మికుల‌ను మోసం చేశార‌ని డాక్ట‌ర్ ల‌క్ష్మ‌న్ ధ్వ‌జ‌మెత్తారు. ఇష్టం వ‌చ్చిన‌ట్లుగా ఓపెన్ కాస్టింగ్ ఏర్పాటు చేసి బొంద‌ల గడ్డ‌గా మారుస్తున్నార‌ని, ఇదేమిట‌ని ప్ర‌శ్నిస్తే.. న‌ష్టాలు వ‌స్తుంద‌ని ఓపెన్ కాస్ట్ తెరిచార‌ని డాక్ట‌ర్ ల‌క్ష్మ‌న్ అన్నారు. అధికారంలోకి రాగానే కుర్చీ వేసుకుని కూర్చుని ఓపెన్ కాస్ట్ అడ్డుకుంటామ‌ని చెప్పిన కేసీఆర్‌.. ఇప్పుడు ఏం చేస్తున్నార‌ని డాక్ట‌ర్ ల‌క్ష్మ‌న్ ప్ర‌శ్నించారు. అధికారంలోకి వ‌చ్చి నాలుగేళ్లయినా..ఇంత‌వ‌ర‌కు కారుణ్య నియామ‌కాల ఊసే ఎత్త‌డం లేద‌న్నారు. గ‌ని ఉద్యోగుల నియామ‌కాల వ‌య‌స్సు 40 ఏళ్ల‌కు పెంచుతామ‌ని చెప్పి, పాత విధానాన్నే అమ‌లు చేస్తున్నార‌ని డాక్ట‌ర్ ల‌క్ష్మ‌న్ మండిప‌డ్డారు. తెలంగాణ త‌ల‌రాత మార్చేందుకు ప్ర‌జ‌లంతా బిజెపితో క‌లిసి రావాల‌ని డాక్ట‌ర్ ల‌క్ష్మ‌న్ పిలుపునిచ్చారు. 
హ‌క్కుల కోసం పోరాడుతున్న రేష‌న్ డీల‌ర్లు, సాక్ష‌ర భార‌త్ కోఆర్డినేట‌ర్ల‌ను బెదిరిస్తూ.. పాల‌న సాగిస్తున్నార‌ని, అప్ర‌జాస్వామికంగా, నియంతృత్వ దోర‌ణితో ప్ర‌జా వ్యతిరేక విధానాల‌కు పాల్ప‌డుతున్న కేసీఆర్ ప్ర‌భుత్వానికి ఇక నూక‌లు చెల్లాయని డాక్ట‌ర్ ల‌క్ష్మ‌న్ అన్నారు.  ఈ  కార్య‌క్ర‌మంలో కేంద్రమంత్రి హ‌న్స్‌రాజ్ అహిర్‌, మాజీ ఎమ్మెల్యేలు గుజ్జుల రామ‌కృష్ణారెడ్డి, ధ‌ర్మారావు, ప‌లువురు ఇత‌ర నేత‌లు పాల్గొన్నారు.