నవ చైతన్యంతో దేశం పురోగమిస్తుంది అవినీతిపరులు, నల్ల ధనాన్ని పూర్తిగా అరికట్టగలిగాం నిజాయితీగా పన్ను చెల్లించే వారి వల్లే దేశం ముందడుగు వేస్తుంది ఒక్కరు పన్ను చెల్లిస్తే కనీసం మూడు కుటుంబాల ఆకలి తీరుతుంది డిజిటల్ ఇండియా దిశగా అడుగులు వేస్తున్నాం సుప్రీంకోర్టులో తొలిసారిగా ముగ్గురు మహిళా న్యాయమూర్తులు భారతీయ మహిళల శక్తికి నిదర్శనం పేదవాడు రోగమొస్తే భయపడకూడదు ఆయుష్మాన్‌ భారత్‌ పథకాన్ని ప్రకటించిన మోదీ తొలి విడతలో 10 కోట్ల మందికి వర్తింపు ఎర్రకోటపై జాతిని ఉద్దేశించి ప్రసంగించిన మోదీ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

నవ చైతన్యంతో దేశం పురోగమిస్తుంది అవినీతిపరులు, నల్ల ధనాన్ని పూర్తిగా అరికట్టగలిగాం నిజాయితీగా పన్ను చెల్లించే వారి వల్లే దేశం ముందడుగు వేస్తుంది ఒక్కరు పన్ను చెల్లిస్తే కనీసం మూడు కుటుంబాల ఆకలి తీరుతుంది డిజిటల్ ఇండియా దిశగా అడుగులు వేస్తున్నాం సుప్రీంకోర్టులో తొలిసారిగా ముగ్గురు మహిళా న్యాయమూర్తులు భారతీయ మహిళల శక్తికి నిదర్శనం పేదవాడు రోగమొస్తే భయపడకూడదు ఆయుష్మాన్‌ భారత్‌ పథకాన్ని ప్రకటించిన మోదీ తొలి విడతలో 10 కోట్ల మందికి వర్తింపు ఎర్రకోటపై జాతిని ఉద్దేశించి ప్రసంగించిన మోదీ

న్యూఢిల్లీఆగష్టు 16(way2newstv.com) 
దేశంలో అవినీతిని ఉపేక్షించమని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ఎర్రకోటపై జాతీయ జెండాను ఎగురవేసిన అనంతరం జాతిని ఉద్దేశించి మోదీ ప్రసంగించారు. అవినీతిపరులు, నల్ల ధనాన్ని పూర్తిగా అరికట్టగలిగాం అని చెప్పారు. పౌరసరఫరా శాఖలో అవకతవకలను అరికట్టి రూ.90వేల కోట్లు ఆదా చేశామని గుర్తు చేశారు. దళారీ వ్యవస్థను పూర్తిగా నిర్మూలించాం. పన్నుదారుల సొమ్మును మంచి పనులకే ఉపయోగిస్తాం. నిజాయితీగా పన్ను చెల్లించే వారి వల్లే దేశం ముందడుగు వేస్తుందన్నారు. ఒక్కరు పన్ను చెల్లిస్తే కనీసం మూడు కుటుంబాల ఆకలి తీరుతుందన్నారు మోదీ. ఇంతకంటే మానవసేవ ఏముంటుందని మోదీ ప్రశ్నించారు. అవినీతి రహిత భారత్ కోసం పౌరులంతా సహకరిస్తున్నారు. ఢిల్లీ వీధుల్లో పవర్ బ్రోకర్ల ఆనవాళ్లు లేకుండా చేయగలిగాం. పైరవీకారులు ఎలా ఉంటారో ఢిల్లీలో కనబడకుండా చేశాం. అవినీతి అధికారులు ఒళ్లు దగ్గర పెట్టుకునేలా చర్యలు చేపడుతున్నామని మోదీ చెప్పారు. అవినీతికి పాల్పడాలంటేనే భయపడేలా చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. 
 
 
 
నవ చైతన్యంతో దేశం పురోగమిస్తుంది  అవినీతిపరులు, నల్ల ధనాన్ని పూర్తిగా అరికట్టగలిగాం
నిజాయితీగా పన్ను చెల్లించే వారి వల్లే దేశం ముందడుగు వేస్తుంది ఒక్కరు పన్ను చెల్లిస్తే కనీసం మూడు కుటుంబాల ఆకలి తీరుతుంది
డిజిటల్ ఇండియా దిశగా అడుగులు వేస్తున్నాం సుప్రీంకోర్టులో తొలిసారిగా ముగ్గురు మహిళా న్యాయమూర్తులు భారతీయ మహిళల శక్తికి నిదర్శనం పేదవాడు రోగమొస్తే భయపడకూడదు ఆయుష్మాన్‌ భారత్‌ పథకాన్ని ప్రకటించిన మోదీ
తొలి విడతలో 10 కోట్ల మందికి వర్తింపు ఎర్రకోటపై జాతిని ఉద్దేశించి ప్రసంగించిన మోదీ
 
సుప్రీంకోర్టులో తొలిసారిగా ముగ్గురు మహిళా న్యాయమూర్తులు ఉన్నారు. ఇది భారతీయ మహిళల శక్తికి నిదర్శనమని మోదీ చెప్పారు. స్వల్పకాల సర్వీస్ కమాండ్‌లో పని చేస్తున్న మహిళలకు పురుషులతో సమాన హోదా కల్పించామన్నారు. క్రీడల నుంచి పార్లమెంట్ దాకా మహిళలు దేశ ఖ్యాతిని ఇనుమడింపజేస్తున్నారు. మహిళలపై నేరాలు చేసే రాక్షస శక్తులు కూడా అక్కడక్కడా కనిపిస్తున్నాయి. మహిళలపై దాడులు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకునేలా చట్టలు రూపొందిస్తున్నామని స్పష్టం చేశారు. ట్రిపుల్ తలాక్‌తో ఎంతో మంది ముస్లిం మహిళలకు అన్యాయం జరిగింది. ట్రిపుల్ తలాక్ నుంచి ముస్లిం మహిళలను రక్షించేందుకు బిల్లు తీసుకువస్తున్నామని మోదీ తెలిపారు. నవ చైతన్యం, నూతనోత్తేజంతో దేశం పురోగమిస్తుంది.. ఇవాళ దేశం ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్తుందని ప్రధాని పేర్కొన్నారు.
అణగారిన వర్గాల అభివృద్ధికి పాటుపడుతున్నాం. అభివృద్ధిలో దేశం ఉన్నత శిఖరాలను అధిరోహిస్తుంది. స్వాతంత్య్ర సమరయోధులకు శిరసు వంచి నమస్కరిస్తున్నా. ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చే దిశగా అహర్నిశలు శ్రమిస్తున్నాం. స్వప్పాన్ని సాకారం చేసే దిశగా దేశం నిరంతరం శ్రమిస్తోంది. 12ఏళ్లకోసారి పుష్పించే నీలగిరి పుష్పాల మాదిరిగా దేశం వికసిస్తోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మిజోరాం, ఉత్తరాఖండ్ బాలికలు దేశ గౌరవాన్ని ఇనుమడింపజేశారు. ఎవరెస్టుపై మన బాలికలు త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి ఆత్మవిశ్వాసాన్ని చాటారు. పార్లమెంట్ సమావేశాలు అత్యంత ఫలప్రదమయ్యాయి. పేదలు, దళితులు, వెనుకబడిన వర్గాల సమస్యలపై సుదీర్ఘ చర్చ సాగింది. ఇటీవలి పార్లమెంట్ సమావేశాల్లో సామాజిక న్యాయం సాధించాం.. ఓబీసీ కమిషన్ బిల్లును ఆమోదించాం.దేశం ఒక సానుకూల దృక్పథంతో ముందుకు సాగుతోంది. దేశ రక్షణలో త్రివిధ దళాలు ఆత్మార్పణ చేస్తున్నాయి. త్యాగధనులందరికీ దేశ ప్రజల పక్షాన ప్రణామం చేస్తున్నా. దేశంలో వర్షాలు పడుతున్నాయన్న శుభవార్త ఒకవైపు ఉంది. మరోవైపు వరదలు వస్తున్నాయన్న బాధ కలుగుతోంది. ఎన్నో సవాళ్లు, అడ్డంకులను అధిగమించాం. అందరికీ న్యాయం,అందరూ అభివృద్ధి పథంలో ముందకు సాగాలి. దేశమంతటా విద్యుత్ వెలుగులు నింపాం. డిజిటల్ ఇండియా దిశగా అడుగులు వేస్తున్నాం. ఇండియన్ నేవీలో ఆరుగురు మహిళలు సేవలందించడం గౌరవంగా భావిస్తున్నా.ప్రతీ గ్రామానికి కనీస సౌకర్యాలు కల్పించాలన్న లక్ష్యం సాకారమవుతోంది. ఇంటింటికి మరుగుదొడ్డి నిర్మించాలన్న స్వప్నాన్ని నాలుగేళ్లలో సాకారం చేశాం. ప్రతి పాఠశాలలో మరుగుదొడ్డి నిర్మించాలన్నదే లక్ష్యం. ఇంటింటికి గ్యాస్ కనెక్షన్, ఆప్టికల్ ఫైబర్ లక్ష్యాలు నెరవేరుతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు టీమిండియా మాదిరిగా పని చేస్తున్నాయి. కొత్త ఐఐటీ, ఐఐఎంలు సహా అనేక విద్యా సంస్థలకు రూపకల్పన జరుగుతోంది. డిజిటల్ ఇండియా కార్యక్రమం అత్యంత వేగంగా సాగుతోంది. గొప్ప గొప్ప నీటి ప్రాజెక్టుల నిర్మాణాలు కూడా పూర్తవుతున్నాయి. రైతులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటున్నారు. సూక్ష్మ బిందు సేద్యంతో వ్యవసాయ రంగంలో కొత్త పుంతలు. రైతులకు కనీస మద్దతు ధర కల్పించిన తమ ప్రభుత్వానిదే. రైతులను గత ప్రభుత్వాలు పట్టించుకోలేదని మోదీ వ్యాఖ్యానించారు.జీఎస్టీ తీసుకువచ్చే క్రమంలో అనేక సవాళ్లను అధిగమించాం. అన్నింటినీ పక్కనబెట్టి జీఎస్టీని అమలు చేసి చూపించాం. కోట్లాది చిన్న వ్యాపారుల సహకారంతో జీఎస్టీని విజయవంతంగా అమలు చేస్తున్నాం. దేశంలో ఇవాళ రికార్డు స్థాయిలో ఆహారధాన్యాలు ఉత్పత్తి చేస్తోంది. ఆహార ధాన్యాలతో పాటు మొబైల్ ఫోన్లనూ ఉత్పత్తి చేస్తుంది. జాతీయ రహదారుల విస్తరణ దేశంలోని ప్రతి మూలను కలుపుతోంది. 2014తర్వాత భారత్ అభివృద్ధిలో దూసుకెళ్తుందని మోదీ స్పష్టం చేశారు. మహిళా సంఘాల ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతమవుతుందన్నారు.దివాళా బినామీ ఆస్తుల బిల్లులతో అక్రమార్కుల భరతం పట్టే ప్రయత్నం చేస్తున్నాం. మేం పార్టీ కోసం రాజకీయ ప్రయోజనాల కోసం పని చేయం. దేశ అభివృద్ధి ప్రయోజనాలే మిన్నగా మా నిర్ణయాలు ఉంటాయని మోదీ స్పష్టం చేసారు.దేశంలోని పేదలకు ఉచితంగా వైద్యసాయం అందించే లక్ష్యంతో చేపట్టిన ఆయుష్మాన్‌ భారత్‌-జాతీయ ఆరోగ్య పరిరక్షణ పథకాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రకటించారు.. సెప్టెంబర్‌ 25న దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ జయంతి నుంచి ఈ పథకం ప్రారంభమవుతుందని ప్రధాని వెల్లడించారు. ఈ పథకం ద్వారా దేశంలోని పేదలందరికీ ఉచిత వైద్య సాయం అందిస్తామన్నారు. తొలి విడతలో 10కోట్ల మందికి ఈ పథకం వర్తించేలా చర్యలు తీసుకుంటామన్నారు. రోగమొస్తే ఏం చేయాలన్న భయం పేదల్లో ఉండకూడదని మోదీ అన్నారు. ఇంట్లో ఒకరికి రోగమొస్తే కుటుంబమంతా దిక్కతోచని స్థితిలోకి వెళ్తుందని.. అలాంటివారందరికీ ఈ పథకం భరోసా ఇస్తుందన్నారు. ఈ పథకం అమలు కోసం అత్యాధునిక సాంకేతికతను వినియోగిస్తామన్నారు. అవసరమైన వైద్య సిబ్బంది, సదుపాయాలు అందుబాటులో ఉంచుతామన్నారు. ఆరోగ్య భారత్‌ లక్ష్యంగా ఈ పథకం పనిచేస్తుందని మోదీ తెలిపారు.ప్రధాని ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన ఈ పథకం ద్వారా ఒక్కో కుటుంబానికి ఏటా రూ.5 లక్షల మేరకు ఆరోగ్య బీమా వర్తిస్తుంది. దీనివల్ల 10 కోట్ల పేద కుటుంబాలకు ప్రయోజనం కలుగుతుంది. మొత్తం మీద 50 కోట్ల మందికి ఈ పథకం వర్తిస్తుందని భావిస్తున్నారు. ప్రభుత్వ నిధులతో నడిచే ఆరోగ్య బీమా పథకాల్లో ఇది ప్రపంచంలోనే అతిపెద్దదని కేంద్ర వర్గాలు చెబుతున్నాయి. సామాజిక, ఆర్థిక, కుల గణాంకాల డేటా ఆధారంగా లబ్ధిదారుల గుర్తింపు సాగుతోంది. ఇప్పటికే 80 శాతం మంది గుర్తింపు పూర్తయింది. ఈ పథకం కింద 1354 చికిత్స ప్రక్రియలను ఆరోగ్య శాఖ చేర్చింది. గుండె బైపాస్‌, మోకీలు మార్పిడి తదితర శస్త్రచికిత్సలు కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకం (సీజీహెచ్‌ఎస్‌) కన్నా 15-20 శాతం తక్కువ ధరకే అందుతాయి. ఈ పథకంలో చేరిన ప్రతి ఆసుపత్రిలోనూ రోగులకు సాయం అందించడానికి ఒక ‘ఆయుష్మాన్‌ మిత్ర’ ఉంటారు. లబ్ధిదారుల అర్హతలను పరిశీలించడానికి ఒక ‘హెల్ప్‌ డెస్క్‌’ను కూడా వారు నిర్వహిస్తారు. క్యూఆర్‌ కోడ్లు కలిగిన పత్రాలను లబ్ధిదారులకు అందిస్తారు. వీటిని స్కాన్‌ చేయడం ద్వారా లబ్ధిదారులను గుర్తించడం, పథకం కింద అందే ప్రయోజనాలకు వారికున్న అర్హతలను పరిశీలిస్తారు. కనీసం పది పడకలున్న ఆసుపత్రి కూడా ఈ పథకంలో చేరొచ్చు. అవసరమైతే ఈ నిబంధనను మరింత సడలించే వెసులుబాటు రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుందని ప్రధాని అన్నారు.
పటిష్టంగా భద్రత
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా దేశ రాజధాని ఢిల్లీలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ పంద్రాగస్టు ప్రసంగం నేపథ్యంలో... ఎన్ఎస్‌జీ కమెండోలు, వేలాదిమంది భద్రతా సిబ్బంది నిత్యం ఎర్రకోటపై నిఘా వేసి ఉంచారు. దీనికి అదనంగా కోట లోపల 500 అత్యాధునిక సీసీకెమేరాలు, కైట్ క్యాచర్లను ఏర్పాటు చేశారు. ఢిల్లీ పోలీస్ విభాగానికి చెందిన 36మంది స్పెషల్ వెపన్స్ అండ్ టాక్టిక్స్ (స్వాట్) మహిళా కమెండోలు వేదిక వద్ద పహారా కాస్తూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.దేశ వ్యాప్తంగా ఇవాళ 72వ స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకుంటున్న నేపథ్యంలో.. ఢిల్లీలోని దాదాపు70వేలమంది పోలీసు సిబ్బంది అడుగడుగునా గస్తీ కాస్తున్నారు. ఒక్క ఎర్రకోట వద్దే 10 వేలమంది పోలీసులు మోహరించడం విశేషం. సీనియర్ మంత్రులు, ఉన్నతాధికారులు, విదేశీ ప్రతినిధులు, ప్రజలు ప్రధాని ప్రసంగం వినేందుకు రానుండడంతో విస్తృత భద్రతా ఏర్పాట్లు చేశారు. 2019లో సార్వత్రిక ఎన్నికలు జరగనుండడంతో ప్రధాని మోదీకి ఇదే చివరి పంద్రాగస్టు ప్రసంగం.