మర్డర్ మిస్టరీని చేధించే " డిటెక్టీవ్ భాస్కర్ " - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

మర్డర్ మిస్టరీని చేధించే " డిటెక్టీవ్ భాస్కర్ "

(way2newstv.com)                  
 మాజీ మిస్టర్ ఆంధ్రా బల్వాన్ , శ్రావణి  హీరో హీరోయిన్లు గా మ‌జ్నుఫిలింస్  పతాకంపై కృష్ణ మోహన్ ని దర్శకుడి గా పరిచయం చేస్తూ మ‌జ్నుబ్రదర్స్ ఎస్.ఎం. సంధాని భాషా ,  మ‌జ్ను సోహ్రాబ్  నిర్మాతలు గా యాక్షన్ థ్రిల్లర్  చిత్రం " డిటెక్టీవ్ భాస్కర్ "  షూటింగ్ పూర్తిచేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకోనుటోంది.ఈ సందర్బంగా చిత్ర నిర్మాతలు మ‌జ్నుబ్రదర్స్ మాట్లాడుతూ...ఈ చిత్రంలో మూడు ఫైట్లు ,రెండు ఛేజింగులు, ఐదు పాటలు ఉన్నాయి, భరత్ బంద్ విజయ్ శేఖర్ సంగీత దర్కత్వంలో పాటలు  అద్ధుభుతంగా వచ్చాయి, ఏడు రాత్రులు తీసిన వాన పాట సినిమాకే కాకుండా వాన పాటలోనే హైలెట్ గా నిలుస్తుందని, త్వరలో ఆడియోని విడుదల చేసి సినిమాను దసరాకు  రిలీజ్ చేయటానికి అన్ని ప్రయత్నాలను చేస్తున్నాము అని అన్నారు . 
 
 
 
మర్డర్ మిస్టరీని చేధించే " డిటెక్టీవ్ భాస్కర్ "       
 
  దర్శకుడు కృష్ణ మోహన్ మాట్లాడుతూ ... రెండు తెలుగు రాష్టాలను వణుకు పుట్టించిన ఓ మర్డర్ మిస్టరీ ని ఓ ప్రవేట్ డిటెక్టీవ్ ఏ విధంగా చేధించాడన్నది చిత్ర కథాంశమని, అను క్షణం ఉత్కంఠ భరితంగా సాగుతుంటుంది. సినిమా చుసిన ప్రతి ప్రేక్షకుడిని థ్రిల్ కు గురిచేస్తుంది . ఈ అవకాశం ఇచ్చిన నిర్మాతలకు కృతజ్ఞతలు అన్నారు . ఇంకా ఈ చిత్రంలో మౌనిక , సాయికిరణ్ , ప్రాచి , సత్య ప్రకాష్ ,జీవా ,గౌతంరాజు ,అన్నపూర్ణమ్మ , దిల్ రమేష్ , శివ సత్యనారాయణ , మిమిక్రి మూర్తి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా : యాదగిరి ,ఎడిటింగ్ : సాయి శ్రీనివాస్ , ఫైట్స్ : సూపర్ ఆనంద్ , సంగీతం : భరత్ బంద్ విజయ్ శేఖర్, కథ , స్క్రీన్ ప్లే , మాటలు , పాటలు ఎక్క్యూటివ్ ప్రొడ్యూసర్ : ఎస్.ఎం.ఎం.ఖాజా , నిర్మాతలు : ఎస్.ఎం. సంధాని భాషా ,  మ‌జ్ను సోహ్రాబ్ , దర్శకత్వం : కృష్ణమోహన్ .