బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శిగా ఆలం పల్లి లత

హైదరాబాద్ ఆగష్టు 7 (way2newstv.com) 
బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శిగా ఆలం పల్లి లత నియమితులైనారు..బిసి మహిళా ఉద్యమంలో కీలక పాత్రను పోషించిన లతను సంఘం రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శిగా నియమించినట్లు శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.ఈ సందర్బంగా లత మాట్లాడుతూ నేడు రాష్ట్రం తో పాటు దేశం లో మహిళలు అనేక సమస్యలను ఎదురుకుంటున్నారని వాటి పరిష్కారం కోసం తనవంతు కృషి చేయగలనన్నారు.మహిళలు విద్య, ఆర్దికంగా,రాజకీయంగా ఎదుగావలసిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. జనాబాలో సగబాగం ఉన్న  మహిళలలకు చట్ట సభల్లో సగబాగం వాటా కల్పించాలని లత కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేసారు.ఇందుకు పార్లమెంటులో మహిళా బిల్లు పెట్టి ఆమోదం తెలుపాలని,అందులో బిసి మహిళలకు జనాబా ప్రాతిపదికన సబ్ కోటా కేటా ఇంచాలని డిమాండ్ చేసారు.ఈ నెల 7 నుండి శ్రీనివాస్ గౌడ్ తలపెట్టిన బిసి చైతన్య బస్ యాత్రలో  బిసిలు అదిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని లత విజ్ఞప్తి చేసారు.
 
 
 
బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శిగా ఆలం పల్లి లత
Previous Post Next Post