ఏషియన్ గేమ్స్ భారత షూటర్లు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ఏషియన్ గేమ్స్ భారత షూటర్లు

న్యూఢిల్లీ ఆగస్టు 21, (way2newstv.com) 
ఏషియన్ గేమ్స్‌లో భారత షూటర్ల అద్భుత ప్రదర్శన కొనసాగుతోంది. విభాగం ఏదైనా మన షూటర్లు మాత్రం పతకాల పంట పండిస్తున్నారు. 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్స్‌లో సంజీవ్ రాజ్‌పుత్ రజతం నెగ్గాడు. మంగళవారం జరిగిన ఈవెంట్లో 452.7 పాయింట్లతో రెండో స్థానంలో నిలవగా.. చైనాకు చెందిన జిచెంగ్ హుయ్ స్వర్ణం సాధించాడు. జపాన్ షూటర్ తకయుకి మట్సుమోటో కాంస్యం గెలుపొందాడు. 
మూడో రోజు ఆరంభంలో భారత్ షూటింగ్‌లో రెండు పతకాలు గెలుపొందింది. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో సౌరభ్ చౌధురీ రికార్డు స్కోరుతో స్వర్ణం సాధించాడు. అదే ఈవెంట్లో అభిషేక్ వర్మ కాంస్యం నెగ్గాడు. 10 మీ. ఎయిర్ రైఫిల్ టీం ఈవెంట్లో అపూర్వీ చండేలా, రవికుమార్ తొలి రోజు కాంస్యం నెగ్గిన సంగతి తెలిసిందే. దీపక్ కుమార్, లక్షయ్ కూడా రజతాలు సాధించారు. ఈ ఏడాది ఆరంభంలో గోల్డ్ కోస్ట్ వేదికగా జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో సంజీవ్ స్వర్ణం సాధించాడు. 2006లో దోహాలో జరిగిన ఆసియా క్రీడల్లో ఇదే విభాగంలో సంజీవ్ కాంస్యం గెలుపొందాడు. 2014 కామన్వెల్ క్రీడల్లో అతడు రజతం దక్కించుకున్నాడు. ఏషియన్ గేమ్స్ భారత షూటర్లు