బ్యాంకులోకి రాజన్న బంగారం

వేములవాడ జనవరి, 31 (way2newstv.com):
రాజరాజేశ్వరస్వామివారి ఆలయ ఖజానాలో ఉన్న బంగారాన్ని బ్యాంక్కు అప్పగించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. హుండీల్లో భక్తులు వేసిన మిశ్రమ బంగారాన్ని గోల్డ్ మానిటరైజేషన్ స్కీంలో భాగంగా ఎస్బీఐలో జమ చేసేందుకు ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. 2010 సంవత్సరం నుంచి 2015 మధ్య కాలంలో ఆలయ ఖజానాకు దాదాపు 18 కిలో గ్రాముల బంగారం సమకూరినట్లు అధికారులు తెలిపారు. ఈ మొత్తం బంగారం ప్రస్తుతం ఆలయ ఖజానాలో ఉంది.


 బ్యాంకులోకి రాజన్న బంగారం

 దీన్ని ఎస్బీఐలో గోల్డ్ మానిటరైజేషన్ స్కీంలో జమ చేసిన పక్షంలో సాలీనా దాదాపు 12 లక్షల రూపాయల వడ్డీ లభించే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. 2010లో 25 కిలోల బంగారాన్ని ఇదే విధంగా బ్యాంకులో జమ చేశారు. దీనికి సంబంధించి ఏటా వడ్డీ వస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
రాజన్న ఆలయ ఖజానాలో ఉన్న 18 కిలోల బంగారాన్ని ఎస్బీఐ అధికారులకు అప్పగించే ప్రక్రియను గురువారం పూర్తి చేసారు. . ఇందుకోసం దేవాదాయ శాఖకు చెందిన పలువురు ఉన్నతాధికారులు, ఎస్బీఐకి చెందిన ఉన్నతాధికారులు గురువారం ఉదయం వేములవాడ చేరుకున్నారు. ఆలయ, బ్యాంకు ముఖ్య అధికారుల సమక్షంలో బంగారం అప్పగింతలు  పూర్తయ్యాయి. 
Previous Post Next Post