ఈ సమ్మర్ హాట్ గురూ...

కరీంనగర్, ఫిబ్రవరి 23, (way2newstv.in)
చలికాలం ముగిసింది. తెలంగాణలోని దాదాపు అన్ని జిల్లాల్లో 2018 అక్టోబర్ నెల రెండోపక్షం నుండి చలిమొదలైంది. ఇప్పటి వరకు అన్ని ప్రాంతాలు కూడా చలికి వణికిపోయాయి. ప్రధానంగా ఆదిలాబాద్, ఖమ్మం, నిజామాబాద్, కరీంనగర్, రంగారెడ్డి, హైదరాబాద్, నల్లగొండ, మెదక్ తదితర జిల్లాల్లో రాత్రివేళ ఉష్ణోగ్రతలు సాధరణం కంటే మూడు, నాలుగు సెంటీగ్రేడ్‌ల వరకు తక్కువగా నమోదయ్యాయి. 


ఈ సమ్మర్ హాట్ గురూ...

చాలా చోట్ల 10 నుండి 12 సెంటమీటర్ల వరకు రాత్రి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాల్లోని అటవీ ప్రాంతాల్లో కనిష్ట రాత్రి ఉష్ణోగ్రత నాలుగుడిగ్రీల సెంటిగ్రేడ్‌కు పడిపోయింది. చలి వల్ల అస్తమా తదితర సమస్యలు ఉన్న వారు అనారోగ్య పరిస్థితులను ఎదుర్కొన్నారు.భారతీయ సంప్రదాయం ప్రకారం చలికాలం శివరాత్రితో ముగుస్తుంది. అంటే అక్టోబర్-నవంబర్‌లో ప్రారంభమయ్యే చలి ఫిబ్రవరి వరకు కొనసాగుతుంది. చలి ముగిసిన వెంటనే ఎండాకాలం ప్రారంభమవుతుంది. ఇప్పటికే పగటివేళ ఎండలు పెరగడం ప్రారంభమైంది. ఉక్కపోత కూడా ప్రారంభమైంది
Previous Post Next Post